బీజేపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పిన యూపీ సీఎం

Update: 2019-05-19 05:28 GMT
ఎన్నిక‌ల కోడ్  అమ‌ల్లోనే ఉంది. కానీ.. ఆ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. తాజాగా ఓటు వేసి వ‌చ్చిన ఆయ‌న‌.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి 400 స్థానాల్ని సొంతం చేసుకుంటుందంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

సుదీర్ఘంగా సాగిన ఎన్నిక‌ల షెడ్యూల్ లో ఏడో విడ‌త పోలింగ్ ఈ రోజు జ‌రుగుతోంది. ఏడో ద‌శ‌లో మొత్తం ఏడు రాష్ట్రాల్లో.. ఒక కేంద్ర‌పాలిత ప్ఆరంతంలో పోలింగ్ సాగుతోంది. ఈ ద‌శ‌లో మొత్తం 59 స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటిల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌రిధిలో 13.. పంజాబ్ ప‌రిధిలో 13.. బెంగాల్ లో తొమ్మిది.. బిహార్ లో ఎనిమిది.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 8.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో నాలుగు.. జార్ఖండ్ లో మూడు..చండీగ‌ఢ్ లో ఒక స్థానంలో పోలింగ్ జ‌రుగుతోంది.

గోర‌ఖ్ పూర్ లో త‌న ఓటును వినియోగించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన యూపీ సీఎం యోగి అదిత్య‌నాథ్ మాట్లాడుతూ.. ఎన్డీయేకు 400 సీట్లు ఖాయ‌మ‌ని తేల్చేశారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌.. ఓటేసి వ‌చ్చి.. త‌మ కూట‌మికి ఇన్ని ఓట్లు వ‌స్తాయ‌ని చెప్ప‌టం ఏమిట‌న్న మాట వినిపిస్తోంది. ఈ చెప్పే లెక్క ఏదో పోలింగ్ పూర్తి అయ్యాక చెబితే బాగుంటుంది క‌దా యోగి?


Tags:    

Similar News