యోగికి షాక్ త‌గుల‌కుండా ముందే జాగ్ర‌త్త ప‌డ్డారే!

Update: 2019-10-16 05:32 GMT
తగినంత బడ్జెట్‌ లేని కారణంగా రాష్ర్టంలోని 25 వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పోలీస్‌ స్టేషన్లు - ట్రాఫిక్‌ సిగ్నళ్ల దగ్గర పనిచేసే వేలాది మంది హోంగార్డులు ఉద్వాసన జాబితాలో ఉన్నారు. దీంతోపాటు రాష్ర్టంలో పనిచేస్తున్న మరో 99వేల మంది హోంగార్డుల పనిదినాల్ని కూడా ప్రభుత్వం కుదించింది. గతంలో 25 రోజులుగా ఉన్న వీళ్ల పనిదినాల్ని ప్రస్తుతం 15 రోజులకు తగ్గించింది. ఈ మేరకు వీరి వేతనాల్లో భారీగా కోత పడనుంది. సోష‌ల్ మీడియా కేంద్రంగా ఊహించ‌ని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్న సీఎం యోగి...ఈ వివాదాస్ప‌ద నిర్ణ‌యం సైతం అదే రీతిలో వైర‌ల్ అవ‌డంతో..వెన‌క్కి త‌గ్గారు.

ఉత్తరప్రదేశ్ హోమ్ గార్డ్ మంత్రి చేతన్ చౌహాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ...హోంగార్డుల తొలగింపు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  తెలిపారు. దీనికి సంబంధించి హోంశాఖ నుండి ఎలాంటి  అధికారిక లేఖ రాలేదని మంత్రి చేతన్ చౌహాన్ స్పష్టం చేశారు. ఎవరినీ వారి ఉద్యోగాల నుండి తొలగించబోమని చెప్పారు.బడ్జెట్ పరిమితుల కారణంగా - పని దినాల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ - హోమ్ గార్డ్ ల సేవ రద్దు చేయబడదని చౌహాన్ అన్నారు.“మాకు హోంశాఖ నుండి అధికారిక లేఖ రాలేదు. ఎవరినీ వారి ఉద్యోగాల నుండి తొలగించబోమని నేను హామీ ఇస్తున్నాను. అధికారిక నిర్ణయం తీసుకోలేదు. బడ్జెట్ పరిమితి కారణంగా - పని రోజులు 30 నుండి 20-22కి తగ్గించబడతాయని ” చౌహాన్ అన్నారు.

పోలీసుశాఖకు చెందిన 25 వేల మంది హోమ్‌గార్డ్‌ల సేవలను ఉత్తరప్రదేశ్ పోలీసులు రద్దు చేశారని మంగళవారం వార్తలు రావ‌డం - ఆ మ‌రుస‌టి రోజుకే...అవి ఉప‌సంహ‌రించుకోవ‌టంలో సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ప్ర‌చారం కీల‌క పాత్ర పోషించింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. పొరుగు రాష్ట్రమైన హ‌ర్యాన ఎన్నిక‌ల్లో ఈ నిర్ణ‌యం ఎఫెప్ట్ ప‌డ‌కుండా..యోగి స‌ర్కారు జాగ్ర‌త ప‌డింద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

   

Tags:    

Similar News