కరోనా వలన హార్ట్ స్ట్రోక్ వస్తుందట..ఎవరు చెప్పారంటే!

Update: 2020-04-24 02:30 GMT
కరోనా వైరస్ కి సంబంధించి రోజుకొక వార్త వెలుగులోకి వస్తుంది. ఈ మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. కరోనావైరస్ కు ఇప్పటికి కూడా ఇంకా సరై న వ్యాక్సిన్ లేదు.
ఆ వ్యాక్సిన్ వచ్చేవరకు ఇలాంటి ఇబ్బందులు పడాల్సిందే. అప్పటి వరకు ఈ భయం ఇలానే కొనసాగుతుంది. తాజాగా కరోనా గురించి మరొక వార్త బయటకు వచ్చింది.

అదేమిటిఅంటే... వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండే వ్యక్తులలో కరోనావైరస్ పెద్దగా ఎఫెక్ట్ చూపకపోవచ్చు అని ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు. 30 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్ వారు కరోనా మహమ్మారిని తట్టుకోగలుగుతారు. అయితే, కరోనా వలన వీరికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యూయార్క్ వైద్యులు తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. కరోనా వలన రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందని ఫలితంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయని న్యూయార్క్ కు చెందిన మౌంట్ సినాయ్ హెల్త్ సిస్టం వైద్యులు చెప్తున్నారు. న్యూయార్క్ లో అత్యధికంగా మరణాలు సంభవించడానికి ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు. ఇకపోతే ఇప్పటివరకు న్యూయార్క్ లో 2,57,216 మంది కరోనా భారిన పడగ ...15,302 మంది కరోనా కారణంగా మరణించారు.
Tags:    

Similar News