మరో 10 రోజులు పాత నోట్లు అక్కడ తీసుకోవాలి

Update: 2016-11-14 06:50 GMT
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలకు ఎదురవుతున్న కష్టాల్ని తీర్చే అంశంపై ప్రధాని నరేంద్రమోడీ దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఆదివారం అర్థరాత్రి వేళ.. క్యాబినెట్ సభ్యులతో సమావేశమైన ఆయన.. క్షేత్రస్తాయిలో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? లాంటి అంశాలపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకున్నట్లగా చెబుతున్నారు. సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత లేనప్పటికీ.. నోట్ల మార్పిడికి.. ఏటీఎం కష్టాలతో ప్రజలు అసౌకర్యానికి గురి అవుతున్నారు.

గంటల తరబడి నిలుచున్నా.. ఏటీఎంలలో పెట్టిన నగదు అయిపోవటం.. మళ్లీ నింపి.. వాటి సేవల పునరుద్ధరణకు సమయం పడుతున్న నేపథ్యంలో ప్రజలు అసహనానికి గురి అవుతున్నారు. ఇది కాస్తా రాజకీయం చేయటానికి కొందరికి ముడిసరుకుగా మారుతోంది. ఇలాంటి వాటితో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించిన మోడీ.. ఆదివారం అర్థరాత్రివేళ మంత్రివర్గ సహచరులతో తన నివాసంలో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో ఏవైతే సేవలకు మినహాయింపు ఇచ్చారో.. ఆ సేవల్ని ఈ నెల 24 వరకు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ బంకులు.. ఆసుపత్రులు.. రైల్వేస్టేషన్లు.. ఎయిర్ పోర్టులు.. మెడికల్ షాపుల్లో పాత రూ.500.. రూ.వెయ్యి నోట్లు చెల్లుబాటు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. మొదట అనుకున్న దాని ప్రకారం ఈరోజుతో ఆ గడువు ముగియాల్సి ఉంది. అయితే.. బ్యాంకులు.. ఏటీఎం సేవల్లో జరుగుతున్న జాప్యంతో ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా ఉండేందుకు వీలుగా ఈ నెల 24 వరకూ పాత నోట్లు చెల్లుబాటు అయ్యేలా ఉత్తర్వుల్ని కేంద్రం విడుదల చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News