వివాదాస్పద నిత్యానందస్వామి ప్రస్తుతం తనపై ఉండే కేసుల లో శిక్షలని తప్పించుకోవడానికి విదేశాలకి వెళ్లి తలదాచుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈయన పై మరో కేసు లో ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు కేసుల్లో ప్రధాన నిందుతుడిగా ఉన్న నిత్యానందస్వామి కి .. తిరుచ్చి యువతి అనుమానాస్పద మృతి కేసు ఆయన్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఈ యువతి కేసులో త్వరలో నిత్యానంద స్వామి అరెస్ట్ అవుతాడా ? అనే ఊహాగానాలు రాష్ట్ర వ్యాప్తం గా నెలకొన్నాయి.
తిరుచ్చి కి చెందిన ఝాన్సీరాణి, ఆమె కుమార్తె సంగీత నిత్యానంద ఆశ్రమం లో గతం లో సంఘ సేవకురాళ్లుగా పనిచేశారు. ఆ సమయంలోనే ఝాన్సీరాణికి మరో సంస్థలో ఉద్యోగం రావడంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టారు. అయితే సంగీత మాత్రం ఆశ్రమంలోనే సేవలందిస్తూ వచ్చారు. ఇలావుండగా 2014 డిసెంబర్ 28న బెంగళూరు నిత్యానంద ఆశ్రమం లో ఉన్న శిష్యుడు ప్రాణానంద ఆశ్రమం లో సంగీత మరణించినట్లు ఆమె తల్లి అయిన ఝాన్సీరాణి కి సమాచారం అందించాడు. దీని తో అక్కడికి వెళ్లిన ఝాన్సీరాణి , పోస్టుమార్టం ముగిసిన అనంతరం కుమార్తె భౌతిక కాయాన్ని 30వ తేదీన తిరుచ్చి కి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే కుమార్తె శరీరం పై ఉన్న గాయాలను చూసి దిగ్ర్భాంతికి గురైన ఆమె.. దీనిపై తిరుచ్చి రాంజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో తన కుమార్తె భౌతిక కాయానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా కోరారు. దీంతో 2015లో తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ శరవణన్ ఆధ్వర్యంలో సంగీత మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపారు. దీనిపై కొన్ని రోజులు గా చర్చ నడుస్తూనే ఉంది. ఈ మద్యే సంగీత తల్లి ఝాన్సీరాణి, నిత్యానంద లైంగిక హింసలకు గురైన ఆర్తిరావు .. నిత్యానంద పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. దీని పై స్పందించిన అమిత్ షా విదేశాల్లో తలదాచుకున్న నిత్యానంద ను ఇక్కడికి రప్పించి అరెస్టు చేయాలని అధికారుల కి తెలిపారు. చూడాలి మరి ఈ కేసు లో అయిన నిత్యానంద స్వామి అరెస్ట్ అవుతాడో లేక మళ్లీ యధా ప్రకారం మాయమై పోతాడో ...