కేంద్ర‌మంత్రిపై కోడిగుడ్ల‌తో దాడి చేశారు

Update: 2017-06-10 18:58 GMT
కేంద్ర‌మంత్రికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతుల మీద అక్క‌డి పోలీసులు కాల్పులు వ్య‌వ‌హారం తాలుకూ నిర‌స‌న ప్ర‌కంప‌న‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతుల ప్రాణాలు పోయిన దానికి నిర‌స‌న‌గా ఒడిశాలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చేప‌ట్టిన నిర‌స‌న కేంద్ర‌మంత్రికి షాకిచ్చింది.

కేంద్ర‌మంత్రి రాధామోహ‌న్ సింగ్ తాజాగా ఒడిశాకు వ‌చ్చారు. స‌బ్ కా సాత్ స‌బ్ కా వికాస్ పేరిట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న‌.. తిరిగి వెళుతున్న వేళ‌.. ఆయ‌న వాహ‌నానికి కొంద‌రు ఆందోళ‌న‌కారులు అడ్డుప‌డ్డారు. ఆపై వాహ‌నంపై కోడిగుడ్ల‌తో  దాడి చేశారు. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ నిర‌స‌న ఒక్క‌సారి అక్క‌డ తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని మాంద‌సౌర్ జిల్లాలో రైతులు నిర్వ‌హించిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌పై పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు రైతులు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా ఒడిశాలో తాజా దాడి జ‌రిగింది. ఈ దాడి జ‌రిపింది ఒడిశా కాంగ్రెస్ నేతలుగా గుర్తించారు. కేంద్ర‌మంత్రిపై కోడిగుడ్లు దాడి చేసిన ఉదంతంపై ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు లోక్ నాథ్ మ‌హార‌థి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఐదుగురు రైతుల ప్రాణాలు తీసిన కేంద్ర‌మంత్రి రాధా మోహ‌న్‌కు ఆ ప‌దవిలో ఉండే హ‌క్కులేదంటూ లోక్ నాథ్ నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర‌మంత్రిపై జ‌రిగిన కోడిగుడ్ల దాడిని ఒడిశా బీజేపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత‌ల కోడిగుడ్ల దాడిలో కేంద్ర‌మంత్రికి కోడిగుడ్లు ఏమీ త‌గ్గ‌లేద‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News