`స్మార్ట్ సిటీ` ప్రాజెక్టు...పేరు గొప్ప ఊరు దిబ్బ!

Update: 2018-03-24 08:45 GMT
భార‌త ప్ర‌ధానిగా 2014లో న‌రేంద్ర మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అనేక ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. స్వ‌చ్ఛ భార‌త్, డిజిట‌ల్ ఇండియా, స్మార్ట్ సిటీస్....ఇలా ర‌క‌రకాల మిష‌న్ లను చేపట్టారు. దేశంలోని 100 నగరాలను అభివృద్ధి చేయడమే ల‌క్ష్యంగా 2015 లో `స్మార్ట్ సిటీ మిషన్` ను మోడీ ప్రారంభించారు. ఆ స్మార్ట్ సిటీల‌లోని ప్రజలకు మ‌రిన్ని మెరుగైన ఉపాధి అవ‌కాశాలు కల్పించడం, ఆ ప‌ట్ట‌ణాల‌ను అభివృద్ధి చేయ‌డం ఆ మిష‌న్ లక్ష్యం. పశ్చిమ బెంగాల్ త‌ప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మిషన్ లో భాగ‌స్వాముల‌య్యాయి. 2022 నాటికి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు...దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.

మొదటి విడ‌త‌లో కేంద్రం ఎంపిక చేసిన 20 నగరాల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విశాఖపట్నం - కాకినాడ‌ల‌కు చోటు ద‌క్కింది. రెండో విడ‌త‌లో తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్....మూడో విడ‌త‌లో ఏపీలోని తిరుప‌తి......నాలుగో విడ‌తలో తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ లు స్మార్ట్ జాబితాలో స్థానం సంపాదించాడు. అయితే, కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ ప్రాజెక్టు వ‌ల్ల పెద్ద‌గా ఒరిగిందేమీ లేద‌ని యువ‌త అభిప్రాయ‌ప‌డుతున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఆ ప్రాజెక్టు త‌యారైంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేవ‌లం కేంద్రం హ‌డావిడి త‌ప్ప ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌ని అంటోంది. త‌మ‌కు ఉపాధి - ఉద్యోగ అవకాశాలు ద‌క్క‌లేద‌ని ఆరోపిస్తున్నారు. కేంద్రం ప్రెస్టీజియ‌స్ గా చేప‌ట్టిన ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింద‌ని యువ‌త అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. స్మార్ట సిటీల‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని, అయితే - ఉపాధి - ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేలా అవి ఉన్న‌పుడే త‌మ‌కు ఉప‌యోగ‌మ‌ని యువ‌త అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌నైనా కేంద్రం ఆ అంశంపై దృష్టి కేంద్రీక‌రించాల‌ని వారు కోరుతున్నారు.
Tags:    

Similar News