ఓపెన్ గా చెప్పేశారంటే.. ఈ 20 మంది వైసీపీ నేతలకు మూడినట్లేనా?

Update: 2023-02-15 05:00 GMT
ముఖం ఎంత బాగాలేకున్నా.. పని తీరు సరిగా లేకున్నా.. మీ ముఖం బాగోలేదు.. మీ పని తీరు సరిగా లేదన్న మాటను చెప్పటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. మంత్రులుగా ఉన్న వారి పని తీరు బాగోలేదని.. ముఖ్యమంత్రి జగన్ ఉన్న వేదిక మీదనే.. మరొకరు వచ్చి నివేదిక తీసి అందులో పేర్లు చదవటం అంటే.. సదరు నేతల పరిస్థితేంటి? వారి తీరు ఎలా ఉంటుందో ఆలోచిస్తే.. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధైర్యానికి.. సాహసానికి సలాం చేయాల్సిందేనని చెప్పాలి.

మరో 14 నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ.. ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు పని చేసిన తీరుకు మార్కులు వేయటం ఒక ఎత్తు అయితే.. అందులో టాప్10లో ఉన్న వారు.. లాస్ట్ 10లో ఉన్న వారి పేర్లు చెప్పటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి మొహమాటాలకుపోకుండా.. ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద చెప్పేసేందుకు వెనుకాడని జగన్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

డిసెంబరు 16 నుంచి ఫిబ్రవరి 13 మధ్య కాలంలో పని తీరు బాగోలేని వైసీపీ నేతల పేర్లను.. పార్టీకి ఎన్నికల వ్యూహాల్ని అందించే ఐప్యాక్ సంస్థ ప్రతినిధి నోటి నుంచి చెప్పించిన తీరు మరో లెవల్ గా చెప్పాలి. ఇంతకీ ఆ 20 పేర్లు ఏంది? అందులో మంత్రులు ఎందరు? ఎమ్మెల్యేలు ఎందరు? అన్న ప్రశ్నలతో పాటు.. ఇంత ఓపెన్ గా చెప్పించేశారంటే.. సదరునేతలకు దాదాపు మూడినట్లేనని.. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న మాట వినిపిస్తోంది.

ఇంతకాలం పని తీరు బాగోలేదన్న పేరు పడిన వారు.. రానున్న రోజుల్లో ఏమైనా తమ తీరు మార్చుకుంటారా? అన్నది మరో ప్రశ్న. ఏమైనా సమకాలీన రాజకీయాల్లో ఈ తరహా ఒరవడి సీఎం జగన్ తోనే మొదలైందని చెప్పాలి. ఇంతకూ పని తీరు ఏ మాత్రం బాగోలేని ఆ 20 మందిని చూస్తే..

మంత్రులు
-  బుగ్గన రాజేంద్రనాథ్
-  ఆదిమూలపు సురేశ్

ఎమ్మెల్యేలు
-  సామినేని ఉదయభాను
-  వసంత క్రిష్ణ ప్రసాద్
-  కొడాలి నాని
-  చెన్నకేశవరెడ్డి
-  బొత్స అప్పల నరసయ్య
-  చింతల రామచంద్రారెడ్డి
-  మేకతోటి సుచరిత
-  జొన్నలగడ్డ పద్మావతి
- మద్దిశెట్టి వేణుగోపాల్
-  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
-  గ్రంధి శ్రీనివాస్
-  అన్నా రాంబాబు
-  కాటసాని రామిరెడ్డి
-  ఆళ్ల రామక్రిష్ణారెడ్డి
-  జి. శ్రీనివాసనాయుడు

సచివాలయాల పరిధిలో కేవలం రెండు గంటల్లోపు మాత్రమే తిరిగిన నేతలు
మంత్రులు
- దాడిశెట్టి రాజా
-  విశ్వరూప్
-  ధర్మాన ప్రసాదరావు

ఎమ్మెల్యేలు
-  వాసుపల్లి గణేశ్
- బాలినేని శ్రీనివాస రెడ్డి
- అనిల్                   
 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News