ఏపీలో ఇంచార్జ్ మంత్రుల నియామ‌కం..

Update: 2019-06-21 05:52 GMT
పాల‌న‌లో ఇప్ప‌టికే ప‌లుసంద‌ర్భాల్లో తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని గుర్తుకు చేస్తున్న జ‌గ‌న్ తాజాగా మ‌రోసారి అదే ప‌ని చేశారు. వైఎస్ హ‌యాంలో జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రుల్ని నియ‌మించేవారు. జిల్లాల్లో మంత్రుల‌తో పాటు.. ఇంచార్జ్ మంత్రుల యాక్టివిటీస్ ఎక్కువ‌గా ఉండేవి. తాజాగా అదే విధానాన్ని జ‌గ‌న్ మ‌రోసారి అనుస‌రించారు. త‌న తండ్రి మాదిరి జిల్లాల వారీగా ప‌ద‌మూడు మందికి ఇంచార్జ్ మంత్రుల హోదాను క‌ట్ట‌బెట్టారు.

ఇంచార్జ్ మంత్రులు త‌మ శాఖ‌ల‌తో పాటు.. త‌మ‌కు కేటాయించిన జిల్లాల అభివృద్ధితో పాటు.. నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు వీరు చూసుకుంటారు. సీనియ‌ర్లు.. స‌మ‌ర్థుల‌కు ఇంచార్జ్ ప‌ద‌వుల్ని క‌ట్ట‌బెట్ట‌టం తెలిసిందే.  ఈ ఉద‌యం (శుక్ర‌వారం)జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రుల పేర్ల‌ను అధికారికంగా విడుద‌ల చేశారు.

జిల్లాల వారీగా ఇంచార్జ్ మంత్రులు ఎవ‌ర‌న్న‌ది చూస్తే..

+   శ్రీకాకుళం - వెల్లంపల్లి శ్రీనివాస్

+   విజయనగరం - చేరుకువాడ శ్రీరంగనాధరాజు

+   విశాఖపట్నం - మోపిదేవి వెంకటరమణ

+   తూర్పుగోదావరి - ఆళ్ల నాని

+   పశ్చిమగోదావరి - పిల్లి సుభాష్ చంద్రబోస్

+   కృష్ణా - కన్నబాబు

+   గుంటూరు - పేర్ని నాని

+   ప్రకాశం - అనిల్ కుమార్ యాదవ్

+   నెల్లూరు - సుచరిత

+   కర్నూలు - బొత్స సత్యనారాయణ

+   కడప - బుగ్గన రాజేంద్రనాధ్

+   అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

+   చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి
Tags:    

Similar News