సిమ్లా టూరిజానికి.. జ‌గ‌న్ బూస్ట‌ప్‌..!

Update: 2021-08-29 23:30 GMT
కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లు.. చిత్రంగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. తా జాగా ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబంతో స‌హా విహార యాత్ర‌కు వెళ్లారు. వాస్త‌వానికి.. ఆయ‌న విదేశాల‌కు వెళ్లాల‌నే ప్లాన్ చేసుకున్నార‌ని.. అయితే.. ప్ర‌స్తుతం.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగోలేని నేప‌థ్యంలో ఇప్పుడు.. విదేశీ ప‌ర్య ట‌న‌ల‌కు వెళ్ల‌డం వ‌ల్ల వ్య‌తిరేక ఫ‌లితాలు వ‌స్తాయ‌ని.. భావించారని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే 25వ పెళ్లి రోజు కూడా క‌లిసిరావ‌డంతో విహార ప‌ర్య‌ట‌న‌కు లోక‌ల్‌గానే ప్లాన్ చేసుకున్నారు.

అయితే.. ఏపీసీఎం జ‌గ‌న్ దంప‌తుల విహార ప‌ర్య‌ట‌న‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని.. ప్ర‌పంచ ప్ర‌సిద్ధ‌.. ప‌ర్యాట‌క ప్రాంత‌మైన సిమ్లాను ఎంచుకున్నారు. వాస్త‌వానికి సిమ్లాకు.. ఉన్న పేరు అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ముఖ ప‌ర్యా ట‌క ప్రాంతంగా.,. శీత‌ల  న‌గ‌రంగా.. మ‌న‌సుకు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంగా.. ప్ర‌పంచ‌స్థాయిలో.. పేరుంది. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ దంప‌తులు కూడా ఇక్క‌డ ప‌ర్య‌టించ‌డం.. ఈ ప‌ర్యాట‌కానికి బూస్ట‌ప్ ఇస్తోంద‌ని స్థానికులు చెబుతున్నారు.

ఎందుకంటే.. ఏపీ సీఎం జ‌గ‌న్ దంప‌తులు.. సిమ్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన విష‌యం.. దేశ‌వ్యాప్తంగా మీడియా క‌వ‌ర్ చేసింది. దీంతో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు.. విశేష ప్ర‌చారం ల‌భించింది. అయితే.. ఇందులో.. సిమ్లాకు వ‌చ్చి న‌.. ప్ర‌యోజ‌నం ఏంట‌నేది  ప్ర‌శ్న‌. దీనికి ఆన్స‌ర్ ఏంటంటే.. సిమ్లా ప్రాంతం ఎంత ప‌ర్యాట‌క ప్రాంత‌మైన ప్ప‌టికీ.. సిమ్లా గురించి పెద్ద‌గా తెలిసిన వారు త‌క్కువే. కానీ, జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నిమిత్తం.. సిమ్లా రావ‌డం.. దీనికి మీడియాలో పెద్ద ఎత్తున క‌వ‌రేజ్ రావ‌డం.. వంటి ప‌రిణామాల‌తో సిమ్లా గురించిన చ‌ర్చ ఇటు సోష‌ల్ మీడియాలోనూ జోరుగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

అదేస‌మ‌యంలో నెటిజ‌న్లు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత‌.. సిమ్లాగురించి వివ‌రాల‌ను గూగుల్ లో ఎక్కువ‌గా  సెర్చ్ చేసి రికార్డు సృష్టించార‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. సిమ్లా టూరిజానికి జ‌గ‌న్ ఫ్యామిలీ బూస్ట‌ప్ ఇచ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News