వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మరికొన్ని గంటల సమయమే ఉన్న సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్ ఈడీ స్క్రీన్స్, ఫోర్ సైడ్ వ్యాన్ల ద్వారా ఈ కార్యక్రమం 'లైవ్' ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జగన్ పెద్ద కుమార్తె వర్షా లండన్ నుంచి విచ్చేశారు. తన తండ్రి గెలుపు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆమె జగన్ తాడేపల్లి నివాసానికి వచ్చారు.
హర్షకు లండన్ లోని ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి వర్సిటీలో సీటు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల పోలింగ్ పూర్తయిన అనంతరం జగన్ లండన్ వెళ్లి తన కూతురిని కలిసి వచ్చారు. తాజాగా జగన్ అఖండ విజయం నేపథ్యంలో నాలుగు రోజుల కిందట వర్షా రెడ్డి లండన్ నుంచి తాడేపల్లి విచ్చేశారు. అద్భుత విజయాన్ని సాధించిన తండ్రికి తన సోదరి వర్షా రెడ్డితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచి తాడేపల్లిలోనే ఉన్న వర్షా రెడ్డి తన తండ్రి ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా దివంగత వైఎస్ కుటుంబ సభ్యులంతా తరలిరానున్నారు. వైఎస్ జగన్ తల్లి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భార్య భారతి, కుమార్తెలతో పాటు దివంగత మాజీ మంత్రి, చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి భార్య, కుమార్తె, అల్లుడు హాజరు కానున్నారు. వీరితో పాటు పులివెందులకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేయనున్నారు.