టాకేంది?: వైసీపీ.. ఓడి గెలిచిందా?

Update: 2015-09-25 13:19 GMT
ఏపీ స‌ర్కారుకు వెన్నులో చ‌లి పుట్టించేలా ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం విప‌క్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గుంటూరులో ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేయాల‌ని సంక‌ల్పించ‌టం తెలిసిందే. అయితే.. జ‌గ‌న్ దీక్షను ఎట్టి ప‌రిస్థితుల్లో చేయనిచ్చేది లేదంటూ వ్య‌వ‌హ‌రించిన ఏపీ స‌ర్కారు మాటే చివ‌ర‌కు నెగ్గిన ప‌రిస్థితి. ఏది ఏమైనా.. దీక్ష మాత్రం చేస్తామ‌ని జ‌గ‌న్ పార్టీ చెప్పినా.. కోర్టు సైతం జ‌గ‌న్ దీక్ష చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌టంతో.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆమ‌ర‌ణ దీక్ష‌ను వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై జ‌గ‌న్ కానీ దీక్ష చేస్తే.. అది త‌మ‌కు భారీ న‌ష్టం వాటిల్లేలా చేస్తుంద‌న్న ఆందోళ‌న ఏపీ అధికార‌ప‌క్షంలో వ్య‌క్త‌మైంది. దీనికి తోడు.. భావోద్వేగ అంశం ఏ మాత్రం రాజుకున్నా.. బాబు స‌ర్కారుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారుతుంద‌న్న అంచ‌నాతో దీక్ష‌కు అనుమ‌తి లేద‌న్న వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చింది.

ప్ర‌భుత్వ యంత్రాంగం ప‌క్కాగా వ్య‌వ‌హ‌రించ‌టం.. పోలీసులు సైతం ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల‌కు త‌గిన‌ట్లే నిర్ణ‌యాలు తీసుకోవ‌టం వైఎస్సార్ కాంగ్రెస్ కు.. కోర్టు గ‌డ‌ప తొక్క‌క త‌ప్పలేదు. అయితే.. దీక్ష కోసం జ‌గ‌న్ పార్టీ దాఖ‌లు చేసిన హౌస్‌ మోష‌న్ ను రాష్ట్ర హైకోర్టు తిర‌స్క‌రించ‌టంతో.. దీక్ష చేసేందుకు అనుమ‌తి ల‌భించ‌లేదు. దీంతో.. జ‌గ‌న్ దీక్ష వాయిదా ప‌డిన ప‌రిస్థితి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌తి సీమాంధ్రుడు కోరుకుంటున్న ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ ఆమ‌ర‌ణ దీక్ష చేస్తాన‌ని చెబితే.. బాబు స‌ర్కారు అడ్డుకోవ‌టంలో విజ‌యం సాధించినా.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో మాత్రం జ‌గ‌న్ రిజిష్ట‌ర్ అయ్యార‌ని ఆ పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఓడి గెలిచిన‌ట్లుగా వారు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News