ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారిని అమితంగా ఆకర్షించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఏం జరగనుందన్న రాజకీయ విశ్లేషణ జోరుగా సాగిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో పాటు.. అమిత్ షాతో గంటన్నర పాటు భేటీ అయ్యారు.
జగన్ ఢిల్లీ టూర్ లో ఆయన రోటీన్ కు భిన్నంగా కనిపించారు. తాడేపల్లిలో మాత్రమే కాదు.. మిగిలిన అధికారిక కార్యక్రమాల్లో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆయన ముఖానికి మాస్కు పెట్టటం తెలిసిందే. అందుకు భిన్నంగా తన ఢిల్లీ టూర్ లో మాత్రం ఆయన ప్రతి చోట ముఖానికి మాస్కు పెట్టుకునే కనిపించారు. కేంద్రమంత్రులతో జరిగే భేటీల్లోనూ ఆయన ముఖానికి మాస్కు తీయకుండా ఉన్నారు.
అయితే.. కేంద్రమంత్రులతో పాటు..అమిత్ షాను కలిసిన సందర్భంలో మాత్రం ఫోటోలకుఫోజులు ఇచ్చే వేళలో ముఖానికి మాస్కును తొలగించారు జగన్. అది మినహా మిగిలినసందర్భాల్లో మాత్రం ముఖానికి మాస్కు తప్పనిసరి అన్నట్లుగా ఉండటం ఆయన్నురెగ్యులర్ గా చూసే వారికి కొత్తగా కనిపించారు. ఎందుకంటే.. మిగిలిన అధినేతలకు భిన్నంగా జగన్ ముఖానికి మాస్కు పెట్టుకోవటానికి అంత ఆసక్తి చూపించరన్న సంగతి తెలిసిందే. ఇందుకు భిన్నంగా ఢిల్లీ టూర్ లో మాత్రం ఆయన ముఖానికి మాస్కు రావటంతో సరికొత్తగా కనిపించారని చెప్పక తప్పదు.