రెండున్న‌ర గంట‌ల్లో రెండు ప్ర‌శ్న‌లా?

Update: 2019-07-17 08:47 GMT
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్ని చూస్తుంటే విప‌రీత‌మైన ఆగ్ర‌హం క‌లుగ‌క మాన‌దు. స‌భా స‌మ‌యాన్ని వృధా చేస్తున్న వైనంపై అధికార‌.. ప్ర‌తిప‌క్షాల వైఖ‌రి గ‌ర్హ‌నీయంగా ఉండ‌ట‌మే కాదు.. త‌ప్పు ప‌ట్టే రీతిలో ఉండ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని ఉద‌యం స్టార్ట్ చేసినా.. ప్ర‌శ్న అడిగినంత‌నే దానిపై వాద ప్ర‌తివాదాలే త‌ప్పించి.. చ‌ర్చ జ‌రుగుతున్న‌దే లేదు.

అస‌లు కంటే కొస‌రు ఎక్కువ‌న్న‌ట్లుగా అవ‌స‌ర‌మైన అంశాల‌పై చ‌ర్చించే విష‌యంలో రెండు పార్టీలు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. ఎవ‌రికి వారు పాత విష‌యాల్ని త‌వ్వుతూ.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌టం ఎక్కువ అవుతోంది. రోజు మాదిరే బుధ‌వారం ఏపీ అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్ అవుతున్న ప‌రిస్థితి.

విప‌క్ష నేత‌ల తీరుతో పాటు.. సొంత పార్టీ నేత‌ల మాట‌లు సైతం సీఎం జ‌గ‌న్ కు చిరాకు పుట్టించిన‌ట్లుగా క‌నిపించింది. ఎప్ప‌టి మాదిరి సంబంధం లేని విష‌యాల‌పై అధికార‌.. విప‌క్షాల‌కు చెందిన నేత‌లు కౌంట‌ర్ల మీద కౌంట‌ర్లు ఇస్తున్న వేళ‌.. క‌లుగుజేసుకున్న జ‌గ‌న్‌.. రెండు పక్షాల‌పై చుర‌క‌లేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌శ్నోత్త‌రాలు స్టార్ట్ చేసి రెండు గంట‌ల‌కు పైనే అవుతుంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ రెండు ప్ర‌శ్న‌లు మాత్ర‌మే జ‌రిగాయ‌ని.. టైం ఎందుకిలా వృధా చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చూసేందుకు విప‌క్షం పై వేలెత్తి చూపించిన‌ప్ప‌టికీ.. ఒక చేత్తో చ‌ప్ప‌ట్లు మోగ‌వు క‌దా?  రెండు చేతులు క‌లిస్తేనే చ‌ప్ప‌ట్లు. స‌భ ముందుకు సాగ‌క‌పోవ‌టానికి స‌భ‌లోని రెండు ప‌క్షాల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోలేం. ఇదే విష‌యాన్ని విప‌క్షంపై కాస్త ఘాటుగా.. స్వ‌ప‌క్షంపై కాస్త చిరాగ్గా జ‌గ‌న్ చెప్పిన తీరుతో.. మ‌ళ్లీ ప్ర‌శ్న‌.. స‌మాధానం దిశ‌గా స్టార్ట్ అయ్యింది. ఇలా అప్పుడ‌ప్పుడు అదిలించే స‌భా నాయ‌కుడు ఏపీ అసెంబ్లీకి చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News