జగన్ కు చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. అనుభవం పేరు చెప్పి జగన్ ను జనాల్లో చులకన చేయాలని చంద్రబాబు ప్రయత్నించి అనేకసార్లు బొక్కబోర్లాపడిన బాబు.. మరోసారి ఏకంగా అసెంబ్లీలో జగన్ కు దొరికిపోయారు. చివరకు నోటి మాట రాకుండా చేసి ప్రతిపక్షాన్ని మూలన కూర్చోపెట్టాడు జగన్.
రాష్ట్రంలో కరవు, రైతులకు రుణాలు, ఆర్థిక సాయాల అంశం మీద జరిగిన చర్చలో '' గత ఐదేళ్లలో రైతులకు సున్నా వడ్డీకి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు'' అని సీఎం జగన్ ఆరోపించారు. దీనికి స్పందనగా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ 2014-17 మధ్య రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేశామని అన్నారు. 2017-19 మధ్య రూ.570 కోట్లు మాత్రమే రైతులకు బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఈ సున్నా వడ్డీపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదన జరిగింది. ఇదంతా సావధానంగా గమనించిన జగన్ ఒకే ఒక్క నిమిషంలో చంద్రబాబు అండ్ కో నోరు మూయించారు.
చంద్రబాబు గాని, ఆ పార్టీ నేతలు గాని నిజాలు చెబితే శాపాలున్నట్లు ప్రవర్తిస్తారని... నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. అంతెందుకు రికార్డులు తెప్పిస్తా, మీరు చెప్పింది అబద్ధం అని నిరూపిస్తాను. రాజీనామా చేస్తారా? అని జగన్ సవాల్ విసిరారు. అధ్యక్షా గత ప్రభుత్వ మాయలు ఎంత దారుణంగా ఉన్నాయంటే... కేటాయింపుల్లో రూ.172 కోట్లు కనిపిస్తాయి. ఖర్చు చూస్తే సున్నా ఉంటుంది. ఇది చాలదా వీరి పాలన ఘనతలు చెప్పడానికి అని జగన్ వ్యాఖ్యానించారు. 2018-19 వార్షికంలో మాత్రమే రైతు రుణాల లెక్కల ప్రకారం.. సున్నా వడ్డీ పథకానికి ప్రభుత్వం రూ.3,068 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఐదేళ్ల మొత్తానికి గమనిస్తే సున్నా వడ్డీకి రూ.15 వేల కోట్లు ఇవ్వాలని వివరించారు. కానీ... ఏ ఒక్క ఏడాదీ రైతుల పట్ల గత ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తించలేదు. రైతులను పట్టించుకోలేదు కాబట్టే విపక్షంలో కూర్చున్నారు అంటూ జగన్ వ్యంగాస్త్రం వేశారు. ఇంతకాలం ఎందుకు ఓడి పోయానో తెలియడం లేదని చంద్రబాబు వెతుకున్న ప్రశ్నకు జగన్ అసెంబ్లీలో సమాధానం ఇచ్చారని బాబుపై సైటైర్లు పడుతున్నాయి.
మొన్నే వచ్చాడు, జగన్ గమనించి ఉండడు... లెక్కలతో ఇరికిద్దాం అని టీడీపీ వేసిన వ్యూహాన్ని పటాపంచలు చేసి ముఖ్యమంత్రి జగన్ అందరినీ విస్మయానికి గురిచేశారు. ఈ ఎంబరాస్ మెంట్ నుంచి ఎలా బయటపడాలో తెలియని చంద్రబాబు '' సీఎం స్థాయిలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలని, మా పాలసీలు మాకు ఉంటాయి.. మీ పాలసీలు మీకు ఉంటాయని వేడి తగ్గించే ప్రయత్నం చేశారు. వయసులో పెద్దవారికి మర్యాద, విలువ ఇవ్వండంటూ ఆవేదన మూడ్ లోకి వెళ్లిపోయాడు. విపక్షాన్ని అవహేళన చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. గాడిదలు కాశారా అంటూ అసెంబ్లీలో అవమానిస్తారా? అని ఆవేదన చెందారు చంద్రబాబు. మొత్తానికి అసెంబ్లీలో చంద్రబాబు డ్యూయల్ రోల్ చూసిన ప్రజలు బాబు కథ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న చందాన ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.