సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నం.. జ‌గ‌న్ స‌ర్కారు తాజా బిల్లులు

Update: 2019-07-22 12:18 GMT
చారిత్ర‌క బిల్లుల్ని ప్ర‌వేశ పెట్టింది జ‌గ‌న్ స‌ర్కార్. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలోని మ‌రే రాష్ట్రంలోనూ ఈ త‌ర‌హా బిల్లుల్ని ప్ర‌వేశ పెట్ట‌ని ప‌రిస్థితి. సోమ‌వారం ఏపీ అసెంబ్లీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌లు చారిత్రక బిల్లుల్ని స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. మ‌హిళ‌లు.. బీసీ.. ఎస్సీ.. ఎస్టీలు.. మైనార్టీ వ‌ర్గాల‌కు పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లులు రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల దృష్టిని ఆక‌ర్షించ‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి.

ఇంత‌కూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన చారిత్ర‌క బిల్లుల సంగ‌తికి వ‌స్తే.. ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కు 75 వాతం ఉద్యోగాల్ని క‌ల్పించేలా ఒక బిల్లు.. నామినేటెడ్ ప‌ద‌వుల్లో 50 శాతం మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ.. నామినేష‌న్ ప‌నుల్లో.. నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ బిల్లుల్ని రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు (సోమ‌వారం) ప్ర‌వేశ పెట్టారు.

ఈ బిల్లుల్లో స్థానిక ప‌రిశ్ర‌మ‌ల్లో 75 వాతం ఉద్యోగాల్ని స్థానికుల‌కే కేటాయించాల‌న్న బిల్లును మంత్రి జ‌య‌రామ్ ప్ర‌వేశ పెడితే.. నామినేష‌న్ ప‌నుల్లో.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీల‌కు 50 వాతం రిజ‌ర్వేష‌న్ కేటాయిస్తూ ప్ర‌వేశ పెట్టిన బిల్లుల సంద‌ర్భంగా ఏపీ విప‌క్షం టీడీపీ నేత‌లు రార్దాంతం చేయ‌టం ప‌ట్ల సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చారిత్ర‌క బిల్లుల్ని స‌భ‌లో ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో.. బిల్లుల్ని అడ్డుకోవాల‌ని ప్ర‌తిప‌క్షం చూడ‌టం ఏమిట‌న్న జ‌గ‌న్‌.. 40 ఏళ్ల అనుభ‌వం అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వీలుగా స్థానిక ప‌రిశ్ర‌మ‌ల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే కేటాయిస్తూ తీసుకొచ్చిన బిల్లు విప్ల‌వాత్మ‌కంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. త‌మ ప్ర‌భుత్వం స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన చారిత్ర‌క బిల్లుల వివ‌రాల్ని తెలియ‌జేస్తూ.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News