చేసిన పనుల గురించి కొందరు గొప్పగా చెప్పుకుంటారు. కొందరు చేయని పనుల గురించి చేసినట్లుగా చెబుతారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండో కోవకు చెందుతారు. కాలం కలిసి రానప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఏమవుతుందో ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబును చూస్తే అర్థం కాక మానదు. ప్రత్యేక హోదా మీద పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలు ప్రతి ఆంధ్రోడికే కాదు.. పక్కనున్న తెలంగాణ వారికి కూడా తెలుసు.
అలాంటి చంద్రబాబు హోదా కోసం తాను చేసిన పనిని గొప్పగా చెప్పుకోవటం చూస్తే.. బాబు అమాయకత్వాన్ని చూసి జాలిపడాలో.. ఆయనకు కొన్ని విషయాలు ఎంతకూ అర్థం కావని సర్దిచెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఏపీ ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదా మీద చర్చ జరుగుతోంది. సభా నాయకుడిగా జగన్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవటానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణంగా వ్యాఖ్యానించారు.
దీంతో చంద్రబాబు కస్సున వేలెత్తి తాను మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. చేతికి మైకు వచ్చిన తర్వాత నుంచి ప్రత్యేక హోదాపై సభలో తీర్మానం చేయటం సంతోషకరమైన విషయంగా అభివర్ణించిన ఆయన.. అందుకు తాను పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు. తమ హయాంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో చెప్పి అభాసుపాలయ్యారు.
ఆర్థిక శాఖ ఇచ్చిన స్టేట్ మెంట్ చదివి వినిపించిన ఆయన.. ప్రత్యేక హోదాను ప్లానింగ్ కమిషన్ కు రిఫర్ చేశారని.. అక్కడికి వెళ్లి అడిగితే తమకు సంబంధం లేదని పాత వాదనను చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కోసం తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని బాబు గొప్పగా చెబుతుంటే.. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పడి పడి నవ్వారు.
తాను చెబుతున్న మాటలకు అధికారపక్షం నవ్వుతున్న తీరుతో కానీ బాబుకు జ్ఞానోదయం కాలేదు.. తాను అభాసుపాలయ్యానని. బాబు మిస్ అయిన పాయింట్ ఏమంటే.. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లామన్నది ముఖ్యం కాదు.. అనుకున్నది సాధించామా? లేమా? అన్నది ముఖ్యం. 29 సార్లు ఢిల్లీకి వెళ్లిన బాబు.. ప్రత్యేక హోదాను సాధించలేక కేంద్రం తాయిలంగా ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి సరేనని రావటం..దాన్నో ఘన విజయంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయటం తన వైఫల్యమన్న విషయాన్ని బాబు మర్చిపోవటంతో జగన్ అండ్ టీం నవ్వారు. వారి నవ్వు బాబు వెన్నులో జలదరించేలా చేసిన పరిస్థితి.లేని గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది మరి.