రాజధాని తరలింపు పై అఖిలపక్షం.. వస్తుందా?

Update: 2019-12-27 07:48 GMT
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఏపీకి 3 రాజధానులతో  పాటు జీఎన్ రావు ఇచ్చిన నివేదిక పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే విశాఖను పరిపాలన రాజధాని గా ఈరోజు ప్రకటించబోతున్నారని ప్రచారం జరిగిన నేపథ్యం లో సడన్ గా జగన్ ఈ విషయం పై వెనక్కి తగ్గినట్టు తెలిసింది.

తాజాగా కేబినెట్ మీటింగ్ లో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చించి.. అఖిలపక్షం సమావేశం తర్వాతనే రాజధాని పై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సున్నితమైన అంశం కావడంతో అఖిలపక్షం భేటి తర్వాతే మూడు రాజధానుల పై ప్రకటన చేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదికపైనే కూడా ప్రకటన చేసే అవకాశం ఉందట.. మూడు రాజధానులను టీడీపీ, బీజేపీ, సీపీఐ, జనసేన వ్యతిరేకిస్తున్నందున వారిందరి తో అఖిలపక్షం ఏర్పాటు చేసి వారి మద్దతు ను తేల్చి ప్రజల్లోకి తీసుకెళ్లి తర్వాత రాజధాని పై నిర్ణయం ప్రకటించాలని జగన్ యోచిస్తున్నట్టు తెలిసింది.
Tags:    

Similar News