‘‘నా పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి అక్కడి ఎయిర్‌పోర్టులో సీసీ కెమేరాలు పనిచేయడం మానేశాయి.. నాపై దాడిచేసిన వ్యక్తిపై ఇంతకుముందు ఓ హత్యాయత్నం కేసు ఉంది.. అయినా అలాంటి వ్యక్తిని భద్రతాపరంగా కీలకమైన ఎయిర్‌పోర్టులో పనిచేయడానికి తీసుకున్నప్పుడు పోలీసులు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చార.. పైగా ఆ హోటల్ కూడా ఒక టీడీపీ నేతది.. గతంలో ఆయన టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో మరో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాత్ర ఉంది.. ఆయన వంగవీటి రంగా హత్య కేసులో ఉన్న వ్యక్తి... ఇన్ని అంశాలున్నప్పుడు నాపై కత్తి దాడి నా అభిమాని చేసిన పని ఎలా అవుతుంది’’ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
దర్యాప్తుకు సహకరించడం లేదన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దాడికి గురైంది తాను కాబట్టి.. అసలిదంతా ఎవరు చేశారు, ఏం చేశారన్నది తనకు చెప్పాలి కానీ, తాను సహకరించడం అనే ప్రశ్న ఎందుకొస్తుందన్నారు.
తనపై దాడి జరిగిన తరువాత ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ బాధ్యతారహితంగా వ్యవహరించిందని.. కానీ, తాను మాత్రం రాష్ట్రంలో ఎలాంటి అల్లకల్లోలం లేకుండా సంయమనంతో ఉన్నానని చెప్పారు. దాడి జరిగిన వెంటనే నిజానిజాలు నిర్ధారించుకోకుండా తాను కూడా ఇది చంద్రబాబు చేయించిన పని అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఏమై ఉండేదో చెప్పాలని అన్నారు. కానీ.. రాష్ట్రంలో అనవసరంగా గొడవలు రేపకుండా.. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు తాను గాయపడిన వెంటనే చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్లానని చెప్పారు.