ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాదయాత్రకు మరింత ఊపు తీసుకువచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాదయాత్రం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీచేసే తొలి అభ్యర్థి పేరు ముందుగానే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి పేరు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈరోజు గోరంట్లలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో తీపి కబురు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బోయలకు కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుంచి ఎంపీ టికెట్ కేటాయిస్తామని ఆయన ప్రకటించారు.
బీసీ సమ్మేళనంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. `చంద్రబాబు లాంటి మోసపూరిత హామీలు నేను ఇవ్వను. బోయలకు న్యాయం చేస్తా. రానున్న కాలంలో ప్రతి జిల్లాలో బీసీ కమిటీలను ఏర్పాటు చేస్తా`అని వెల్లడించారు. రానున్న కాలంలో బీసీ కమిటీలను ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ కమిటీ సభ్యులు బీసీల అభిప్రాయాలను సేకరిస్తుందని తెలిపారు. బోయలకు కర్నూలు లేదా అనంతరం జిల్లా నుంచి ఎంపీ టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉంది. కులాలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నారని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు ఎన్నిలకు ముందు బీసీలకు సబ్‌ప్లాన్ అని చెప్పి అనంతరం దాన్ని మాయచేసే ప్రకటనగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. `బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన నాలుగేళ్లలో 40 వేల కోట్లకు గాను కేవలం 9 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అంటే 20 శాతం కూడా ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కేఈ కృష్ణమూర్తి ఊరిలో అవసరమైన ఒక బ్రిడ్జి కూడా నిర్మించలేకపోయారు. నేను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బ్రిడ్జి శంకుస్థాపనకు టెంకాయ కొడతామన్నారు.ఆ తర్వాత మరో రెండేళ్లలో బ్రిడ్జిని పూర్తిచేస్తాం. చంద్రబాబుకు బీసీల మీద ప్రేమంటే ఇస్త్రీ పెట్టెలు పంచడం, కత్తెర్లు ఇవ్వడం... కానీ మహానేత వైయస్‌ఆర్ హయాంలో ప్రతి బీసీ కుటుంబానికి లబ్ది చేకూరేలా పథకాలను అమలు చేశారు. ఎంతవరకు చదువుకున్నా ఫీజులు వంద శాతం కట్టడానికి ముందుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసి ఎంతోమందిని డాక్టర్లు, ఇంజినీర్లుగా తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 30వేలుండే ఫీజులను 70 వేలకు పెంచేసి వారిని చదువులకు దూరం చేశాడు. ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని.. స్కాలర్‌షిప్‌లు రావడం లేదని నన్ను పాదయాత్రలో కలిసిన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తాను` అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.