" చంద్రబాబు నాయుడికి మా ఖర్మ కొద్దీ ఓటు వేశాం. అన్ని వర్గాలకు ఏదో చేస్తానన్నారు. నమ్మాం. కానీ ఏం చేయలేదు." ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలవి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పేవి... చేసేవి అన్నీ అబద్దాలేనని ప్రతిపక్ష నేత జగన్మోన్ రెడ్డి మండిపడ్డారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఓ తెలుగు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. ప్రజలకు అబద్దాలు చెప్పి... వాస్తవాలకు అతీతంగా ప్రలోభ పెట్టాన చంద్రబాబు నాయుడు అడ్డదారిలో ముఖ్యమంత్రి అయ్యారని జగన్ మండిపడ్డారు.
బీసీల పట్ల ప్రేమ ఉంది అంటే వారికి ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమేనా అని జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు మోసం చేసారని, అప్పుడు తమకు తెలియక ఓట్లు వేశామని ప్రజలు బాధపడుతున్నారని జగన్ చెప్పారు. విద్యార్ధులను, మధ్యతరగతి వారిని, మహిళలను, ఉద్యోగులను అన్ని విధాలుగా మోసం చేశారని ప్రజలు గుర్తించారని జగన్ చెప్పారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని ఏనాడు వ్యక్తిగతంగా విమర్శించలేదని, చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదాపై మాట్లాడాల్సిన చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని శాసనసభలో మాట్లాడారన్నారు. " జగన్ అనే నేను శాసనసభలో ప్రత్యేక హోదా గురించి చంద్రబాబును ప్రశ్నించాను" అని జగన్ స్పష్టం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలపై తాను, తన పార్టీ ముందు మాట్లాడామని, జీఎస్టీ కమిటీలో తెలుగుదేశం నాయకుడు యనమల రామక్రిష్ణుడు సభ్యుడని గుర్తు చేశారు. "ప్రధాని ఎవరైనా కాని... ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామంటే వారికి నేను మద్దతు ఇస్తాను" అని జగన్ స్పష్టం చేశారు. నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీతో కలిపి కాపురం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిని తిట్టడాన్ని ప్పజలు గమనిస్తున్నారని.అబద్దాలకు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరని జగన్మోన్ రెడ్డి విమర్శించారు. తన పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు దగ్గరుండి చూశానని, రేపటి తన పాలనకు అ కష్టాలే మార్గదర్శకత్వం వహిస్తాయని అన్నారు.