ఆసక్తికర ట్వీట్ చేశారు ఏపీ విపక్ష నేత..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మదర్స్ డే సందర్భంగా ఆయన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం మరొకటి లేదన్న జగన్.. మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
తానీ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణమన్న జగన్.. అమ్మకు ధన్యవాదాలు అంటూ సింఫుల్ గా తన మనసులోని మాటల్ని చెప్పేశారు. గడిచిన 160 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్.. ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుంటున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఊరడిస్తూ.. వారి సమస్యల్ని పరిష్కరిస్తానని మాట ఇస్తున్నారు.
తాజాగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన ఈ రోజు ఉదయం(ఆదివారం) కైకలూరు శివారులో యాత్రను ప్రారంభించారు. కాకతీయ నగర్.. దెయ్యంపాటు.. చింతపాడు.. కొవ్వాడ లంక మీదుగా మణుగులూరు చేరుకోనున్న జగన్.. మధ్యాహ్న భోజన విరామం తర్వాత మహేశ్వరపురం చేరుకుంటారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.