ఆ..50 మంది ఎవ‌రు? జ‌గ‌నన్న స‌ర్వే టైమ్స్

Update: 2022-03-15 17:30 GMT
ఇవాళ్టి వైసీపీ శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశం వాడీవేడీగా సాగింది అనేందుకు తార్కాణాలు ఎన్నో! పైకి జ‌గ‌న్ ఏమీ ఇంత కాలం చెప్ప‌కున్నా లోప‌ల ఎంతో దాచుకున్నార‌నే విష‌యం స్ప‌ష్టం అయింది.ముఖ్యంగా ఇంటెలిజెన్స్ స‌ర్వేలు మొత్తం ఎన్నో విష‌యాల‌ను ఆధార స‌హితంగా సీఎంకు చేర‌వేశాయి.  జిల్లాలలో ఎమ్మెల్యేల ప‌నితీరుకు సంబంధించి ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న చాలావిష‌యాలు, ప‌లు సోష‌ల్ మీడియా పోస్టులు వీట‌న్నింట‌నీ ఇంటెలిజెన్స్ ఓ ప్రామాణికంగానే తీసుకుంది.

వైసీపీకి చెందిన డిజిట‌ల్ వింగ్ కూడా వీటిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసింద‌ని తెలుస్తోంది.అందుకే ఎమ్మెల్యేల ప‌నితీరుకు సంబంధించి ముఖ్య‌మంత్రి ఇవాళ కొన్నిసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌గ‌లిగారు. ఆధారాల్లేకుండా ఓ ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తి మాట్లాడ‌రు అన్న‌ది కూడా ఇప్ప‌టి స‌మాచారం ఆధారంగానే నిర్థార‌ణ చేయొచ్చు. ఎవ్వ‌రు ఏం అనుకున్నా క్షేత్ర స్థాయిలో చాలా మంది ప‌నితీరు బాలేద‌ని తేలిపోయింది.

వైసీపీ గెలుచుకున్న 151 స్థానాల‌లో 50 స్థానాల‌లో ఎమ్మెల్యేలు పూర్ పెర్ఫార్మెన్స్ ను క‌లిగి ఉన్నారు.వీరికి సంబంధించి డేటా అంతా సీఎం సిద్ధం చేశారు. త్వ‌ర‌లో వారితో  వ్య‌క్తిగ‌తంగా కూడా మాట్లాడ‌నున్నారు. ఏప్రిల్ రెండు నుంచి చేపట్ట‌బోయే గ‌డ‌ప గ‌డ‌ప కూ వైసీపీ కార్య‌క్ర‌మం తో ఎవ‌రు ఎటు ఉన్నారు ఎలా ప‌నిచేస్తున్నార‌న్న‌ది కూడా తేలిపోనుంది.అదేవిధంగా క్షేత్ర స్థాయిలో అస్స‌లు ప‌నిచేయ‌ని వారిలో ఎనిమిది మంది మ‌హిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

బాగా ప‌నిచేయ‌ని ఎమ్మెల్యేలలో 30 మంది తొలి సారి ఎన్నిక‌యిన వారు కూడా ఉన్నారు.ఇవ‌న్నీ కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉన్న గాలి వార్త‌లు కాదు. పూర్తి వివ‌రాల‌తో నివేదిక‌లు తెప్పించుకుని మాట్లాడిన మాట‌లు.అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌ర్వే ఆధారంగానే టిక్కెట్లు అని, ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ పేరు తెచ్చుకున్న వారికి మ‌ళ్లీ అవ‌కాశం అని లేదంటే త‌న వ‌ద్ద‌కు రావొద్ద‌ని వ‌చ్చినా ఎటువంటి ఫ‌లితం ఉండ‌ద‌ని తెగేసి చెప్పేశారు.

దీంతో ఎమ్మెల్యేలలో క‌ల‌వ‌రం మొద‌లైంది.అప్పుడే అంత‌ర్మ‌థ‌నం కూడా  తీవ్ర‌స్థాయిలో ఉంది. ఎందుకంటే చాలా మంది పైకి డబ్బా మాట‌లు చెబుతూ లోప‌ల అస్స‌లు పార్టీ అంటే గౌర‌వం లేకుండా న‌డుచుకుంటూ ఉన్నార‌ని విప‌క్ష స‌భ్యుల విమ‌ర్శ‌లు తిప్పికొట్టడంలో కూడా వెనుకంజ‌లోనే  ఉన్నార‌ని జ‌గ‌న్ ఇవాళ తేల్చిన సంగ‌తి!
Tags:    

Similar News