ఆంధ్రప్రదేశ్ లో కరువు పరిస్థితులపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. అందుకే వారికోసం ‘వైఎస్ ఆర్ రైతు భరోసా’ పథకం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అంతేకాదు రైతుల కోసం రెండు వేల కోట్లతో ‘విపత్తు సహాయనిధి’ని ఏర్పాటు చేస్తామని సీఎం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షభావ పరిస్థితులు, రైతుల కష్టాల్లో తోడుగా ఉండేందుకు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఏపీలో 62శాతం మంది రైతులేనని.. ఏడాదికి రైతుకు కుటుంబానికి రూ.12500 పెట్టుబడి సాయం అందిస్తామని జగన్ చెప్పుకొచ్చారు.ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తమ ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం ఇస్తుందని తెలిపారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. రూ.16 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు భరోసాను అమలు చేస్తామని పేర్కొన్నారు. దేశచరిత్రలోనే ఇది ఒక రికార్డుగా అభివర్ణించాడు.
2018-19 సంవత్సరంలో తీవ్ర కరువుతో రైతులు ఇబ్బందులు పడ్డారని జగన్ వివరించారు. ఇప్పటికీ సరిగ్గా విత్తనాలు పడలేదని.. కేవలం 3.2 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయన్నారు. జూన్ 2 నుంచి నిన్నటి వరకు ఏపీలో 135.5 మిల్లీలీటర్ల వర్షం పడాల్సి ఉండగా 71 మి.లీటర్లే మాత్రమే పడిందన్నారు.
ఇక చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన వైనాన్ని అసెంబ్లీ వీడియో ప్లే చేసి చూపించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.384 కోట్ల బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని జగన్ ప్రకటించారు.