జగన్ పై ఎత్తులకు చిత్తయిన చంద్రబాబు

Update: 2019-12-28 05:02 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన వ్యూహచతురత తో చంద్రబాబు, టీడీపీని దిక్కుతోచని స్థితి లో పడేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జగన్ తన ఎత్తులతో ప్రతి పక్షాలను గందర గోళంలో పడేశారు.

శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం లో విశాఖ ను పరిపాలన రాజధాని గా చేస్తారన్న ముందస్తు సమాచారంతో మిగతా ప్రతిపక్షాలతో కలిసి టీడీపీ పెద్ద ఎత్తున ప్రతి ఘటన సృష్టించడానికి రెడీ అయ్యిందట.. నేతలు, కార్యకర్తలను సమీకరించి అల్లకల్లోలం సృష్టించడానికి సర్వం సిద్ధం చేసుకుందట. మంత్రులను అమరావతి దాటి వెళ్లకుండా మార్గాలను అడ్డుకోవాలని పెద్ద స్కెచ్చే వేశారట.. రాజధాని ప్రాంతమంతా అట్టుడికిలే పెద్ద ఎత్తున నిరసనలకు వారు ప్రణాళికలు రచించినట్టు తెలిసింది. టీడీపీ అనుకూల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి సమరానికి రెడీగా ఉంచారట.. అయితే వీరందరి కుట్రలను ముందే తెలుసుకున్న సీఎం జగన్ వ్యూహాత్మకం గానే వైజాగ్ ను పరిపాలన రాజధాని గా మార్చే నిర్ణయాన్ని వాయిదా వేశారని సమాచారం.. వైఎస్ జగన్ రాజధానిగా వైజాగ్ ను చేస్తారని కత్తులు నూరుతున్న టీడీపీ శిభిరానికి ఆ ప్రకటన రాక పోవడంతో అంతా హతాశులయ్యారని తెలిసింది.

సీఎం వైఎస్ జగన్ ప్రతి పక్షాల కుట్రలను ప్రణాళికల ను ముందే పసిగట్టి అప్పటికే అమరావతి ప్రాంతమంతా నిషేధిత ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వ్యూహాత్మకంగా నిన్నటి కేబినెట్ మీటింగ్ లో అమరావతిలో టీడీపీ చేసి భూకుంభకోణాలను బయటపెట్టారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణకు రెడీ అయ్యారు. ఇక వైజాగ్ ను పరిపాలన రాజధాని గా చేయకుండా బీసీజీ నివేదిక వచ్చాక అధ్యయనం చేస్తామని నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ నిర్ణయం తో మరో 15 రోజుల పాటు టీడీపీ కి పని లేకుండా.. ఉద్యమించకుండా జగన్ వ్యూహాత్మకం గా దూరం పెట్టినట్టు అయ్యింది.

దీన్ని బట్టి జగన్ రాజధాని నిర్ణయాన్ని జనవరి రెండో వారానికి వాయిదా వేశారు. దీంతో జగన్ ప్రకటిస్తారని అల్లకల్లోలం సృష్టించడానికి రెడీ అయిన టీడీపీ శ్రేణులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురైందట.. పైగా అమరావతి భూ కుంభ కోణాన్ని వైసీపీ తెరపైకి తీసుకు రావడం తో ఇప్పుడు వారంతా డిఫెన్స్ లో పడి పోయారట.. ఇప్పుడు తమ అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని తెగ భయ పడి పోతున్నారట..

సీఎం జగన్ వ్యూహాత్మకం గా టీడీపీ కుట్రలను చెక్ చెప్పేలా కేబినెట్ మీటింగ్ లో రాజధాని ప్రకటనను వాయిదా వేశారు. టీడీపీ ప్లాన్లన్నింటిని బెడిసికొట్టేలా చేశాడు. పైగా టీడీపీ నేతల భూకబ్జా వెలికితీసి సీబీఐ విచారణకు పూనుకుంటూ వారిని భూకబ్జాదారులుగా ప్రజల ముందు ఉంచారు. ఇప్పుడు జగన్ కబ్జా ఆరోపణలను తొలగించుకునే ప్రయత్నం లోనే టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కాబట్టి జగన్ నిన్న వేసిన ప్లాన్లతో టీడీపీ శిబిరం షాక్ కు గురైందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలతో జగన్ చాలా పరిణతి కనబరుస్తున్నారని ప్రశంసిస్తున్నారు.


Tags:    

Similar News