ఢిల్లీకి జగన్.. రాజధాని వాయిదా అందుకేనా?

Update: 2019-12-28 05:25 GMT
సీఎం జగన్ అమరావతి నుంచి రాజధానిని విశాఖ కు తరలించబోతున్నారనే టెన్షన్ తో తెలుగు తమ్ముళ్ల కు నిద్ర పట్టడం లేదు. తాజాగా నిర్ణయాన్ని వాయిదా వేసిన జగన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. రాజధాని పై హైపవర్ కమిటీ వేయాలని జగన్ డిసైడ్ అవ్వడం తో రాజధాని ప్రహసనం కొనసాగుతోంది.

అయితే ఇంత గందర గోళంగా సాగుతున్న ఏపీ రాజధాని వ్యవహారంలో ఏపీ బీజేపీ నేతలు స్పందిస్తున్నా కేంద్రం వైఖరి ఏంటనేది మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ బీజేపీ నేతలు రాజధాని రైతుల కు మద్దతు గా దీక్షలు చేసి జగన్ ను వ్యతిరేకించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే అమరావతి తరలించ వద్దని దీక్ష కూడా చేశారు. మరి వీరి అభిప్రాయమే కేంద్రం వైఖరా అనే దాని పై క్లారిటీ లేదు.

ఈ నేపథ్యం లోనే సీఎం జగన్ రాజధాని విషయం లో క్లారిటీ ఇవ్వడానికే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు వచ్చే వారం ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారని తెలిసింది.

ఏపీ బీజేపీ నేతల నిరసనలు.. సుజనాచౌదరి వంటి నేతల బెదిరింపుల నేపథ్యం లో అసలు కేంద్రం వైఖరేంటనేది తెలుసుకునేందుకు.. రాజధాని పై తన నిర్ణయాన్ని కేంద్రానికి వెళ్లడించేందుకు జగన్ ఢిల్లీ బాట పట్టబోతున్నట్టు తెలిసింది. ఏపీ రాజధాని విషయం లో కేంద్రం నుంచి అభ్యంతరాలు రాకుండా చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం స్వయంగా ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసి రాజధాని మార్పునకు గల కారణాలను వివరించాలని భావిస్తున్నారు. రాజధాని లో చంద్రబాబు, టీడీపీ నేతల అక్రమాల నివేదిక ను వారికి సమర్పించి మూడు రాజధానుల పై వివరించి కేంద్రం అంగీకారం తోనే రాజధాని పై ప్రకటన చేయాలని జగన్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తర్వాతే ఏపీ రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.


Tags:    

Similar News