జ‌గ‌న్ కు శ‌ల్య ప‌రీక్షా.. అగ్ని ప‌రీక్ష‌.. రెండూ కూడా!

Update: 2022-12-16 03:43 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌న‌లోరెండు కోణాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటాయి. ఒక‌టి ప్ర‌జ‌ల‌ను అతి త‌క్కువ కాలంలోనే మ‌చ్చిక చేసుకోవాల‌నే తాప‌త్ర‌యం. రెండు..  తండ్రిని మించిన పాల‌న అందించాల‌నే వ్యూహం ఉన్నాయి. అయితే.. ఈ రెండు వ్యూహాలపై ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. అయితే.. ఈ వ్యూహ సాధ‌న‌లోనే ఆయ‌న వేస్తున్న అడుగులు సొంత పార్టీలోనే ఏవో అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నాయి.  

దీనికి కార‌ణం.. కేవ‌లం సంక్షేమాన్ని న‌మ్ముకోవ‌డం .. ఒక్క‌టే కాదు, ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కుపాదంతో అణిచి వేయాల‌న్న కాంక్ష ఉంద‌నే వాద‌న వైసీపీ నేత‌ల్లోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, తొలి రెండున్న రేళ్లు అలానే పాల‌న క‌నిపించింది. టీడీపీ నేత‌ల‌పైకేసులు పెట్ట‌డం.. అర్ధ‌రాత్రి, తెల్ల‌వారుజామున అరెస్టులు.. ఇలా అనేక రూపాల్లో వారిపై క‌సి తీర్చుకున్నార‌నే విమ‌ర్శ‌లు టీడీపీ నుంచివినిపించాయి.

దీనిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లడంలో ఆ పార్టీ స‌క్సెస్ అయింది.  దీంతో వైసీపీ అధినేత వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రో వైపు న్యాయ‌స్థానాలు కూడా దీనిని త‌ప్పుప‌ట్ట‌డం.. ప్ర‌భుత్వంపై సీరియ‌స్ కావ‌డం తెలిసిందే.

ఇక‌, సంక్షేమాన్ని న‌మ్ముకున్నా.. ఇది అప్పుల ఊబివైపు స‌ర్కారును రాష్ట్రాన్ని కూడా తోస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికితోడు.. 100 మంది క‌ట్టే ప‌న్నుల‌ను కేవ‌లం కొద్ది మందికి ఇవ్వ‌డాన్ని కూడా ప్ర‌జ‌లు హ‌ర్షించ‌డం లేదు.

దీంతో జ‌గ‌న్ వేసిన వ్యూహాలు.. చేసిన ప‌నులు కూడా ప్ర‌జాతీర్పున‌కు ఏమేర‌కు నిలుస్తాయ‌నేది ప్ర‌శ్న‌. అంటే.. ఒక ర‌కంగా జ‌గ‌న్‌కు ఇది శ‌ల్య ప‌రీక్ష‌!!   త‌నే పెంచి పోషించిన సంక్షేమం.. అప్పుల దిశ‌గా న‌డిపిస్తున్న తీరు వంటివి ఆయ‌నకు అగ్నిప‌రీక్ష‌గా మారాయ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ రెంటికీ.. ప్ర‌జ‌లు ఇచ్చే  తీర్పు.. నిజంగానే ఏపీలో ఒక రికార్డు స్థాయి రాజ‌కీయ వాతావ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News