రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ప్రభుత్వాన్నిసూటిగా నిలదీస్తున్నట్లుగా కనిపించినప్పటికీ.. ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఏపీలోని తన సోదరుడు జగన్ సర్కారును వేలెత్తి చూపించేలా ఉండటం ఆసక్తికరంగా మారాయి.
ఒకే ప్రెస్ మీట్ లో కొత్త జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జిల్లాల గురించి ప్రస్తావిస్తూ.. ఆ సందర్భంగా ఏపీ ప్రస్తావన తెచ్చినప్పుడు.. కొత్త జిల్లాలపై కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పట్టి.. కొత్త జిల్లాల విషయం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల మీద షర్మిల స్పందిస్తూ.. ''ఏది ఎవరు చేసినా.. ఒక ఫోకస్ ఉండాలి. ఒక ఎజెండా ఉండాలి. ఒక స్ట్రాటజీ ఉండాలి కదా? కేసీఆర్ ఇక్కడ 33 జిల్లాలు చేశారు.. ఏం చేశారు? కనీసం ఆ 33 జిల్లాలకు కావాల్సిన సిబ్బందినైనా డిప్లాయ్ చేసుకోగలిగారా? ఏం లాభం? ఏదో న్యూస్ లో ఉండాలని మాట్లాడాతారనుకుంటా. ఎందుకు చేస్తారు? ఎందుకు మాట్లాడతారో నాకర్థం కాదు''అని మండిపడ్డారు.
తాజాగా రాజకీయాల జరుగుతున్న తీరు గురించి ఘాటు విమర్శలు చేస్తూ ఆమె తీవ్రంగా స్పందించారు. ''ఒకడైనా ఆలోచించారా? ఎవడి స్వార్థం వారిది. ఇప్పుడేమో గలీజు మాటలతో.. వీధి కుక్కల్లాగా రోడ్ల మీద కోట్లాడుతున్నారు. ప్రజలకు ఏం మిగులుతుందండి. ఎంటర్ టైన్మెంట్ తప్ప'' అని మండిపడ్డారు. తాజాగా కేసీఆర్ సర్కారు డ్రగ్స్ మీద టాస్కు ఫోర్సు ఏర్పాటు చేయటాన్ని ఆమె తప్పు పట్టారు.
''ఈ రోజు డ్రగ్స్ అన్నారు. డ్రగ్స్ మీద టాస్కు ఫోర్సు అట. అంటే.. ఇష్యూ డైవర్టు చేయటానికే కదా? అంటే.. 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు దాని గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమిటి మనం? టాస్కుఫోర్సు గురించి. రైతులు ఇష్యూ కాదిక్కడ. అంతేకదా.. ఒక ఇష్యూను డైవర్టు చేయటానికి మరో ఇష్యూ తీసుకొస్తారు.. ఏదో మాట్లాడతారు. ఏం చేశారండి టాస్కుఫోర్సు. ఇంతకుముందు ఏం చేశారండి కేసీఆర్ గారు. డ్రగ్స్ ఏమైనా రాత్రికి రాత్రి వచ్చిన సమస్యా?'' అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో డగ్స్ ఏమీ కొత్తగా రాలేదని వ్యాఖ్యానించిన షర్మిల.. కేసీఆర్ ప్రభుత్వానికి మంట పుట్టే వ్యాఖ్యలు చేశారు. ''డ్రగ్స్ కొత్తగా వచ్చాయా మన రాష్ట్రంలోకి? డ్రగ్స్ ను.. మద్యాన్ని పెంచి పోషిస్తోంది కేసీఆర్ గారు కాదా? ఈయన అరికట్టాలనుకుంటే ఈ ఏడేళ్లు.. ఎనిమిదేళ్లలో అరికట్టలేరా? ఇప్పుడు కొత్తగా టాస్కు ఫోర్సు అట. ఈయన ఇప్పుడే నిలేశారట. ఇప్పుడిక చింపేస్తారట'' అంటూ ఎద్దేవా చేసిన షర్మిలను మరో విలేకరి.. ఏపీలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు సైతం పరిపాలన వికేంద్రీకరణ కోసమే కదా? అంటూ ప్రశ్న అడగబోతున్న వేళ అడ్డుకున్న షర్మిల.. ''ఏపీ గురించి నాతో మాట్లాడకండి'' అంటూ విసురుగా బదులివ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా షర్మిల మాటల్ని చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలన చేయకుండా ఇష్యూలను డైవర్టు చేయటానికే ఏదో హడావుడి నిర్ణయాలు చేస్తున్నారే తప్పించి.. మరేమీ లేదన్న అర్థం వచ్చేలా మాట్లాడిన ఆమె మాటలు ఇప్పుడు సంచలంగా మారాయి.