ఇప్పటిదాకా తన తండ్రి పేరు చెప్పుకుని తెలంగాణాలో షర్మిల రాజకీయం చేస్తున్నారు. ఆమె వైఎస్సార్టీపీని స్థాపించారు. ఆ పార్టీకి కర్త కర్మ క్రియ అన్నీ ఆమె అన్నట్లుగానే ఉన్నారు. ఒక పెద్ద నాయకుడు ఎవరూ అందులో చేరలేదు అని చెప్పాలి. షర్మిల కాళ్ళరిగేలా పాదయాత్ర చేస్తున్నారు. అలాగే నోరు నొప్పిపుట్టేలా అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ఎన్ని చేసినా కూడా షర్మిలకు తెలంగాణాలో స్పేస్ దొరకడంలేదు. ఒక విధంగా ఆమె ఇసుక నుంచి తైలాన్ని తీస్తున్నట్లుగా తెలంగాణాలో తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.
అయితే అది సాధ్యపడే విషయం కాదని విశ్లేషకుల నుంచి సామాన్యుల దాకా అందరికీ తెలుస్తున్న విషయం. ఇదిలా ఉంటే తెలంగాణాలో రాజన్నరాజ్యం తీసుకువస్తాను అని షర్మిల పదే పదే అంటున్నారు. దాని మీద టీయారెస్ నేత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
రాజన్న అంటే ఏపీకే పోవాలంటూ వైఎస్ షర్మిల మీద ఘాటు కామెంట్స్ చేశారు. తెలంగాణాలో మాత్రం రాజన్న రాజ్యం అసలు సాధ్యం కాదని ఆయన కుండబద్ధలు కొట్టారు. తాము రాజన్న వ్యతిరేక రాజ్యం కొట్లాడి మరీ తెచ్చుకున్నామని చెప్పుకొచ్చారు. ఎవరైనా రాజన్న రాజ్యం అంటే తెలంగాణా సమాజమే తరిమికొడుతుందని కూడా సుఖేందర్ రెడ్డి చెప్పడం విశేషం.
ఇక తెలంగాణాకు వైఎస్సార్ వ్యతిరేకి అన్న సంగతి తెలియదా అని ఆయన షర్మిలను నిలదీశారు. తెలంగాణా ఇస్తే ఏపీ నుంచి ఎవరైనా రావాలనుకుంటే వీసాలు తీసుకుని రావాల్సి ఉంటుందని నాడు వైఎస్సార్ అనలేదా అని ఆయన ప్రశ్నించారు. గతాన్ని షర్మిల మరచిపోతే పోవచ్చు. రాజన్న పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకోవచ్చు. కానీ ప్రజలు పిచ్చి వాళ్ళు కాదని ఆయన అన్నారు.
తన తండ్రి వైఎస్సార్ వీసా కావాలన్న దాని మీద షర్మిల ఏమి సమాధానం చెబుతారో చూస్తామని కూడా ఆయన చెప్పడం విశేషం. వైఎస్సార్ బొమ్మతో ఇక్కడ ఓట్లు అడుక్కుందామనుకుంటే షర్మిల పప్పులు ఉడకవని గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణాతో కనీసం సంప్రదించకుండా పోలవరం లోని ఏడు మండలాలను, సీలేరు ప్రాజెక్టుని కేంద్రం ఏపీలో కలిపేసింది అని ఆయన మండిపడ్డారు.
పోలవరం అనగానే హైదరాబాద్ లో ఏపీని కలుపుతారా అని ఏపీ మంత్రులు అంటున్నారని, వారు ఒక్కసారి 1956 చరిత్ర తెలుసుకోవాలని ఆయన అన్నారు. నాడు మద్రాస్ లో ఆంధ్ర రాష్ట్రం ఉందని ఇపుడు మళ్లీ మద్రాస్ లో ఏపీని కలిపేస్తామంటే ఊరుకుంటారా అని గుత్తా ఏపీ మంత్రుల మీద గుస్సా అయ్యారు.
ఇక కాళేశ్వరం పంప్ హౌస్ మునగడానికి కారణం ప్రకృతి వైపరిత్యం తప్ప మానవతప్పిదం అన్నది లేనే లేదని గుత్తా పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికలు వస్తే కోమటి రెడ్డి బ్రదర్స్ మునగడం ఖయామని కూడా గుత్తా జోస్యం చెప్పారు. మొత్తానికి చూస్తే గుత్తా చేసిన అన్ని కామెంట్స్ లో షర్మిల మీద చేసినవి నెవర్ బిఫోర్ అంటున్నారు. అలాగే అవి మామూలు పంచులు కానే కావని కూడా అంటున్నారు. మరి దీనికి ఆమె సమాధానం ఏమి చెబుతారో చూడాలి.