వైఎస్ షర్మిల పార్టీ పేరు ఖరారు?

Update: 2021-06-04 03:47 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో పార్టీని ప్రకటిస్తామన్న ఆమె ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ పేరు ‘వైయస్ఆర్ తెలంగాణ పార్టీ’గా నమోదైనట్టు సమాచారం. ఈ మేరకు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ నివేదికల ప్రకారం.. మార్చి నెలలోనే భారత ఎన్నికల కమిషన్‌కు దీనిపై ఒక దరఖాస్తును వైఎస్ షర్మిల సమర్పించినట్టు తెలిసింది. ఎన్నికల కమిషన్ మార్చి 23న జాతీయ దినపత్రికల్లో ఈ మేరకు అభ్యంతరాలపై నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దరఖాస్తు దాఖలు చేసినది షర్మిలా కాదు, పార్టీ అధ్యక్షుడు / ఛైర్మన్ గా పేరు తెచ్చుకున్న వదుక రాజగోపాల్ పేరు మీద ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది.  హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో ఆయన చిరునామాను చూపించారు. జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రధాన కార్యదర్శిగా సి సుధీర్ కుమార్, కోశాధికారిగా నూకల సురేష్ ఉన్నారు. జూన్ 16లోపు ఏదైనా వ్యక్తి లేదా సంస్థ నుండి అభ్యంతరాలు ఉంటే ఎన్నికల కమిషన్ కు తెలియజేయాలని పిలుపునిచ్చింది.

షర్మిల స్వయంగా ఎన్నికల కమిషన్ ముందు ఎందుకు దరఖాస్తు చేయలేదనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. షర్మిలతో కొంత బేరసారాలు చేయటానికి రాజగోపాల్ స్వయంగా ముందుగానే దరఖాస్తును దాఖలు చేసినట్లు కూడా ఒక చర్చ జరుగుతోంది.

రాజగోపాల్ - షర్మిలతో ఉన్న ఇతరుల చిత్రాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఈ ఫొటోలు ఇటీవలివి కావా లేదా పాతా  అనేది స్పష్టంగా తెలియదు. రాజగోపాల్ మరియు ఇతరులు ఇప్పటికే పార్టీతో సంబంధం కలిగి ఉన్నారా అనే దానిపై స్పష్టత లేదు.
Tags:    

Similar News