వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు సంబంధించి మరో ముందడుగు పడింది. వైఎస్ షర్మిల పార్టీ పేరుతో పాటు, పార్టీ ఏర్పాటు తేదీపై ఆమె ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ నిన్న అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వాడుక రాజగోపాల్ తెలిపారు. ముందుగా చెప్పినట్టే షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న రాజకీయ పార్టీ పేరు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) గా అధికారిక ప్రకటన వచ్చేసింది. పార్టీ పేరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు సమన్వయకర్త రాజగోపాల్ ప్రకటించారు. పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాసినట్లు రాజగోపాల్ వెల్లడించారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని రాజగోపాల్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ...తెలంగాణ రాజకీయాల్లోకి అరంగేట్రం షురూ చేసిన వైయస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గా వాడి వేడి విమర్శల బాణాలు సైతం వదులుతున్నారు. కరోనా వైరస్ వ్యాక్సినేషన్, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రైతుల వెతలు తదితర అంశాల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు షర్మిల. త్వరలో అధికారికంగా ప్రకటించబోతోన్న తన వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ కి తొమ్మిది మంది అధికార ప్రతినిధులను సైతం ఇప్పటికే నియమించారు షర్మిల. వీరిలో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి ఉన్నారు.