తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గత కొద్దిరోజులుగా దూకుడుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా వేములవాడలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల కంటే మిగతా రాష్ట్రాల్లో మంచి పథకాలు చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు.
రాజీనామా చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
రైతులకు రుణమాఫీ చెయ్యడం లేదని రాజీనామా చేస్తారా? రైతులు పంట నష్టపోతే ఆదుకోవడానికి పంట బీమా అమలు చేయట్లేదని రాజీనామా చేస్తారా? అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. `నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, యువతను నిరుద్యోగానికి బలిచేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అని మాట ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? పేదలందరికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా?` అని షర్మిల కేటీఆర్ ను ప్రశ్నించారు.
దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తలేరని రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. 'మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా? మీరు సల్లంగుండాలి. రాష్ట్రం రావణకాష్టం కావాలి. అంతే కదా మీ అద్భుత పాలన? ' అంటూ షర్మిల వ్యంగస్త్రాలు సంధించారు.
ఇదిలాఉండగా, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్ షర్మిల తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు 14 పార్లమెంట్ నియెజకవర్గాల్లో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పరిధి లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. జిల్లాల్లో పర్యటిస్తూ..ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు,కరోనా కారణంగా నవంబర్ 9న ఈ పాదయాత్ర వాయిదా పడింది. అయితే ఆ పాదయాత్రను ఈనెల 11 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.