దివంగత మహానేత వైఎస్.. టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లు చెప్పినంతనే.. ఇరువరి నడుమ నడిచిన రాజకీయ పోరు ఇట్టే గుర్తుకు రాక మానదు. కానీ.. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇద్దరూ ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. మంచి స్నేహితులు. అలాంటి ఇద్దరు ఒకదశలో ముఖం.. ముఖం చూసుకోవటానికి సైతం ఇష్టపడని పరిస్థితి.
చంద్రబాబు.. వైఎస్ ల మధ్య ఉన్న దోస్తానా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె నోట ఎన్నో ఆసక్తికర అంశాలు వచ్చాయి. అందులో వైఎస్.. చంద్రబాబు మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఒకటి. అంతేకాదు.. తమ స్నేహంలో భాగంగా బాబుకు మంత్రి పదవిని ఇప్పించటంలో వైఎస్ ఎంత కీలక భూమిక పోషించారో చెప్పుకొచ్చారు.
వైఎస్.. బాబులకు సంబంధించి విజయమ్మ ఏం చెప్పారో చూస్తే..
+ అప్పట్లో వైఎస్.. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. కేఈ కృష్ణూర్తి.. చంద్రబాబు కలిసి ఉండేవారు. ఇంటికి కూడా బాగా వస్తుండేవారు. అంజయ్యగారితో పోట్లాడి మరీ చంద్రబాబుకు వైఎస్ మంత్రి పదవి ఇప్పించారు.
+ వైఎస్.. చంద్రబాబుల మధ్య పోలిక అవసరం లేదు. ఎందుకంటే వీరిద్దరి మధ్య నక్కకూ.. నాగలోకానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో అంతే ఉంది. వైఎస్ తో బాబును పోల్చాల్సిన అవసరమే లేదు.
+ బాబు కంటే జగన్ ఎందుకు మేలు అంటే.. గతంలో వైఎస్ ఎంపీలతో సమావేశమైన సందర్భంగా బాబుకు చెప్పిందేమంటే.. 2000 సంవత్సరం కంటే ముందు ప్రాజెక్టులు కట్టి ఉంటే నికర జలాలు కేటాయిస్తారు. ప్రాజెక్టులు మొదలుపెట్టు అని అప్పట్లో బాబుకు వైఎస్ సూచించారు. దేవుడు అవకాశం ఇచ్చి 14 ఏళ్లు పవర్ లో ఉన్నా చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు. చరిత్రలో మరోసారి అలాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా.
+ వచ్చే ఎన్నికల్లో బాబు భారీగా డబ్బు ఖర్చు చేస్తారని చెబుతున్నారు. మరి.. బాబును ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి పార్టీలో ఉందా? అన్న ప్రశ్నకు స్పందించిన విజయమ్మ.. వచ్చే ఎన్నికల్లో బాబు చాలా డబ్బు ఖర్చు పెడతారని చెబుతున్నారు. కానీ.. మాకు ప్రజల అండ ఉంది. మంచి పనులు చేస్తామనే వారికి కాకుండా వేరే వాళ్లకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు? మంచి చేస్తానన్నంటున్న జగన్‌కే తప్పనిసరిగా ఓటు వేస్తారు. వైఎస్ పాలన చేశారుగా. జగన్ పాలన రావాలన్న భావన ప్రజల్లో ఎక్కువగా ఉందన్నది నాకు కనిపిస్తోంది. బాబు దగ్గర అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఉంటే మా దగ్గర ప్రజలు ఉన్నారు.