అన్న జగన్ ఏలుబడిలో తనకు న్యాయం జరగడంలేదని గొంతెత్తి రోదిస్తోంది ఒక చెల్లెలు. ఆమె డాక్టర్ సునీత. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె. తన తండ్రి మూడున్నరేళ్ల క్రితం అత్యంత దారుణంగా హత్యకు గురి అయ్యారు. అయితే హంతకులు ఎవరో ఈ రోజుకీ తెలియలేదు. సీబీఐకి ఈ కేసు అప్పగించినా కూడా వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇక చివరి ప్రయత్నంగా ఆమె ఈ కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందో తెలియదు కానీ అన్న జగన్ పాలనలో ఏపీలో తన తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో తేలరు అని మాత్రం లోకానికి ఆ విధంగా సునీత చెప్పేశారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే సునీత ఈ కేసు విషయంలో పోరాడుతూనే తన శక్తిని మరింత పెంచుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు. ఎందుకంటే ఆమెకు అతి పెద్ద కుటుంబం అయిన వైఎస్ ఫ్యామిలీ నుంచి పెద్దగా మద్దతు దొరకడంలేదు అని అంటున్నారు. దాంతో పొలిటికల్ గా ముడిపడి ఉన్న ఈ కేసులో చిక్కుముళ్ళు విప్పాలీ అంటే కచ్చితంగా తాను కూడా రాజకీయాల్లోనే ఉండి తేల్చుకోవాలని ఆమె పట్టుదలతో ఉన్నారని అంటున్నారు.
ఎన్నో రకాలుగా న్యాయ పోరాటాలు చేసి విసిగి వేసారిన సునీతకు ఇపుడు రాజకీయాల్లోకి రావడం అనివార్యంగా ఉంది అని అంటున్నారు. అయితే సునీత ఈ రోజుకీ తన రాజకీయ ప్రవేశం మీద నోరు విప్పడంలేదు. ఆమెను ఈ మధ్య ఒక ప్రముఖ చానల్ ఇంటర్య్వూ చేసినపుడు కూడా రాజకీయాల మీద ఆసక్తిని కానీ నిరాసక్తను కానీ వ్యక్తం చేయలేదు. అంటే ఆమె ఫ్యూచర్ లో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది.
ఆమె కనుక రాజకీయ ప్రవేశం చేస్తే ఏ పార్టీ తరఫున అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఆమె చాయిస్ గా ఉండదు అని అంటున్నారు. అంటే ఏపీలో విపక్ష పార్టీల నుంచే ఆమె బరిలోకి దిగాలి. అలా కనుక చూసుకుంటే టీడీపీ జనసేన రెండు పార్టీలు ఆమెకు ఆప్షన్లు అని అంటున్నారు. టీడీపీ అనుకూల మీడియా అయితే ఇప్పటికే ఆమెను తరచూ ఇంటర్వ్యూ చేస్తూ అండగా ఉంటోంది. సో ఆమె అనుకుంటే టీడీపీ సీటు కోరిన చోట ఇవ్వడం ఖాయం. అలా కాదు అనుకుంటే జనసేన నుంచి పోటీ చేయడానికి కూడా అవకాశం ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి చాలా సార్లు వివేకా కేసు గురించి మాట్లాడుతూ సునీత పక్షాన నిలబడ్డారు.
ఇక ఈ రెండు పార్టీలు అనుకుంటే ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది అన్నది మరో చర్చ. ఆమె కడప ఎంపీగా బరిలోకి దిగుతుందా. లేక పులివెందుల నుంచే నేరుగా అన్న జగన్ మీద పోటీ చేస్తుందా అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది. పులివెందులలో వివేకాకు పెద్ద ఎత్తున బలముంది. ఆయన దశాబ్దాల రాజకీయ ఫలితంగానే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సులువుగా గెలిచే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల సునీత జగన్ని నేరుగా ఢీ కొడితే ఆ రాజకీయమే వేరుగా ఉంటుంది అని అంటున్నారు. అపుడు జగన్ కి పులివెందుల పెను సవాల్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.