పెట్టుబడులు ఆకర్షించేందుకు విదేశీ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానం మేరకు ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ లో జరుగుతున్న సదస్సుకు ఏపీ సీఎంతో పాటు మంత్రులతో కూడిన టీం వెళుతున్నసంగతి తెలిసిందే.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దావోస్ సదస్సుతో పాటు పలు విదేశీ పర్యటనల సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా వెళుతున్న దావోస్ పర్యటన వేళ.. ఏపీ రాజధాని ఏదన్న ప్రశ్నను సంధిస్తే ఏమని సమాధానం చెబుతారు? అన్నసందేహం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను ప్రశ్నిస్తే.. ఆయన ఆసక్తికర రీతిలో సమాధానం ఇచ్చారు.
తాము అమరావతిని మాత్రమే కాదు.. మొత్తం ఏపీని ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. అలాంటప్పుడు రాజధాని పట్టణం ఏంటి? అడిగితే ఏమంటారు? అన్న ప్రశ్నకు మరోమారు క్లారిటీ ఇస్తూ.. ఒక్క పట్టణాన్ని కాకుండా.. మొత్తం రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తామన్నారు.
అయినప్పటికీ రాజధాని పట్టణం ఏదని అడిగితే ఏం చెబుతారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఇప్పుడు ఏమున్నదో అదే చెబుతామన్నారే తప్పించి.. సూటిగా మాత్రం సమాధానం చెప్పక పోవటం చూస్తే.. జగన్ ప్రభుత్వానికి ఇంకా ఏపీ రాజధాని మీద మల్లగుల్లాలు పడుతున్న వైనం చూస్తే.. ఏం తిప్పలు రా బాబు అన్న భావన కలుగక మానదు.