ధర్మాడి సత్యానికి వైఎస్సార్ అవార్డ్ ...ఎందుకో తెలుసా

Update: 2019-11-01 05:07 GMT
గత నెల 15వ తేదీన పాపికొండలు వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు వద్ద ముంపుకు గురైన విషయం అందరికి తెలిసిందే. ప్రమాదం జరిగిన రోజున రాయల్ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణం చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.. ఈ ప్రమాదం నుండి 26 మంది  సురక్షితంగా  బయటకు పడ్డారు.

ఇక అప్పటినుండి కష్ట పడితే ..దాదాపు 38 రోజుల తరువాత బోటు బయటకి వచ్చింది.  ధర్మాడి సత్యం బృందం, విశాఖకు చెందిన మరో టీమ్ కలిసి ఈ బోటుని బయటికి తీసుకువచ్చారు. ప్రభుత్వం కూడా ఈ బోటుని బయటకి తీసుకురాలేము అని చేతులెత్తేసిన సమయంలో సత్యం బృదం బయటకి బోటుని బయటకి తీసుకువచ్చారు.  

గోదావరిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యంపై సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. గోదావరిలో మునిగిన బోటును బయటికి తీస్తానంటే సర్కారు ధర్మాడి సత్యానికి బాధ్యత అప్పగించింది. వందల అడుగున లోతున ఉన్న బోటును నిపుణులు కూడా వెలికితీయటానికి సాహసం చేయలేకపోయారు. అయినప్పటికీ ధర్మాడి సత్యం ధైర్యం చేసి బోటును బయటికి తీసేందుకు పెద్ద సాహమే చేశాడు. ధర్మాడి సత్యం ధైర్యానికి మెచ్చిన సర్కార్ ఆయనకి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు   ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.వైయస్సార్ లైఫ్ టైమ్ అవార్డులు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన తర్వాత తొలి అవార్డు ధర్మాడి సత్యానికే దక్కింది.
Tags:    

Similar News

ఇక ఈడీ వంతు