8న బెంగుళూరులో ఘ‌నంగా వైఎస్ జ‌యంతి!

Update: 2018-07-06 05:49 GMT
ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ ద్వారా.....వేలాదిమంది నిరుపేద విద్యార్థులు రాష్ట్రంలోని టాప్ కాలేజీలో ఉన్న‌త విద్య‌ను ఉచితంగా అభ్య‌సించ‌గలుగుతున్నారు.....బ‌డుగు - బ‌ల‌హీన వ‌ర్గాలు - నిరుపేద‌లు ఎంద‌రో....కార్పొరేట్ హాస్ప‌టళ్ల‌లో ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన వైద్యం  ఉచితంగా చేయించుకోగలుగుతున్నారు......రోడ్డు ప్ర‌మాదాల‌కు గురైన ఎంతోమందికి 108 ద్వారా ప్రాణ భిక్ష ల‌భించింది.....ఇవి కాక ప్ర‌జ‌ల కోసం మ‌రెన్నో సంక్షేమ ప‌థ‌కాలు....ఉపాధి అవ‌కాశాలు....ఇవ‌న్నీ క‌ల్పించిన ఘ‌న‌త మ‌హానేత‌ - ఏపీ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిది. మ‌డ‌మ తిప్ప‌ని - మాట త‌ప్ప‌ని ఆ జ‌న‌నేత తిరిగిరాని లోకాల‌కు వెళ్లినా....కోట్లాది మంది గుండెల్లో ఆయ‌న చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచి ఉంటారు. ఆయ‌న ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిపొందిన వారి గుండెల్లో వైఎస్ కొలువై ఉంటారు. అనుక్ష‌ణం ప్ర‌జా క్షేమ‌మే ధ్యేయంగా ప‌నిచేసిన మ‌హానేత 69వ జ‌యంతి ఈ నెల 8వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో వైఎస్ 69వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు బెంగుళూరు త‌దిత‌ర ప్రాంతాల‌లోని వైఎస్ అభిమానులు ప‌లు సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

జూలై 8వ తేదీన బెంగుళూరులోని వైఎస్ ఆర్ కుటుంబం ఆధ్వ‌ర్యంలో ప‌లు ప్రాంతాల్లో వైఎస్ అభిమానులు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టనున్నారు. హొంగసంద్రలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వ‌హించ‌బోతున్నారు. వైఎస్ అభిమానులు.....గుంతకల్లు అనిల్ - నరసింహ రెడ్డి - శివ శంకర్ రెడ్డి - చంద్ర -  తేజల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. దొడ్డ తోగూరులో కూడా వైఎస్ ఆర్ దొడ్డ తోగూరు యూత్ స‌భ్యులు రంగా రెడ్డి - కృష్ణ వర్దన్ - అశోక్  - శ్రీను - అమర - బయ్యారెడ్డిల ఆధ్వ‌ర్యంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం జ‌ర‌గ‌నుంది. బెంగుళూరులోని నిమ్ హాన్స్ హాస్ప‌ట‌ల్ లో కేక్ కటింగ్ మరియు పండ్లు - అన్నదాన కార్యక్రమం జ‌ర‌గ‌నుంది. పవన్ - హరికృష్ణ యాదవ్ - పురుషోత్తం లు ఈ కార్య‌క్రామాన్ని నిర్వ‌హించ‌బోతున్నారు. మారత హల్లిలో అంజి - విజయ రాఘవ రెడ్డి - ప్రతాప్ ముకుందాపురంల ఆధ్వర్యంలో `వైఎస్ ఆర్ మెగా ర‌క్త‌దాన శిబిరం` నిర్వ‌హించ‌నున్నారు. హెబ్బాల్ లో వెంకట్ - కుమార్ ల ఆధ్వ‌ర్యంలో సేవా కార్య‌క్రమాలు నిర్వ‌హించ‌బోతున్నారు. లగ్గెరెలో డీ.మంజునాథ్ - భాస్కర్ కంఠీపురం - యంజేర్ గౌడ  - రవి హేమావతిలు ప‌లు కార్య‌క్రమాలు చేపట్ట‌బోతున్నారు.


Tags:    

Similar News