దివంగత ముఖ్యమంత్రి.. పేదల పాలిట దేవుడిగా ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న వైఎస్ రాజశేఖరరె డ్డి.. ఆత్మ క్షోభిస్తోందా? ఆయన ఏ లోకంలో ఉన్నా.. ఆయన ఆత్మ తల్లడిల్లుతోందా? అంటే.. వైఎస్ అభిమా నులు.. పూర్వ సన్నిహితులు.. ఔననే అంటున్నారు. నిజానికి వైఎస్ ఏపీని పాలించిన సమయం అత్యంత తక్కువనే చెప్పాలి. అది కూడా వ్యతిరేక వర్గాల ప్రచారం.. ప్రతిపక్షాల దుమారం.. అన్నీ కలగలిపి.. ఆయన హయాంలో తీవ్రమైన ఎదురు గాలులు వీచాయి. అయినప్పటికీ.. ఆయన తను గీసుకున్న గీతలను.. నిర్ణయించుకున్న లక్ష్యాలను ఎన్నడూ వీడలేదు.
పేదల తలరాతలు మార్చడమే ధ్యేయంగా.. పాదయాత్రలో తాను కన్నవిన్న అనేక సమస్యలకు అధికా రంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపించారు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇటు ప్రజలు.. అటు పార్టీ నేత లు.. అనేలా.. ఆయన వ్యవహరించారు. ఒకవైపు పథకాలు.. అభివృద్ధి నినాదంతో ముందుకు సాగారు.. మరోవైపు పార్టీని పటిష్టం..చేసేందుకు కార్యకర్తలను అనుక్షణం ప్రోత్సహించారు. ఇదే వైఎస్ మార్క్ అజెండాగా ఉండేది. ఇది.. ఆయనను రాజకీయంగా అత్యున్నత శిఖరానికి .. అదేసమయంలో ప్రజా బాంధవుడిగా.. జనాల హృదయాలకు చేరువ చేసింది.
అందుకే.. ఇప్పటికీ.. సెప్టెంబరు 9 వస్తే.. పలు గ్రామాల్లో.. ప్రజలు.. స్వచ్ఛందంగానే రాజశేఖరరెడ్డి వర్ధంతి ని జరుపుకొంటున్నారు. ఇక, రాజకీయంగా కూడా పార్టీలు మారినా.. సొంత పార్టీలు పెట్టుకున్నా... వైఎస్‌పై ఈగవాలనీయని నాయకులు ఉన్నారు. ఏపీలోను.. తెలంగాణలోనూ ఆయన కేబినెట్‌లో పనిచేసిన మంత్రుల నుంచి అధికారుల వరకు ఎందరో ఆయనను ఆరాధించేవారు ఉన్నారు. వైఎస్‌ను ఎవరైనా పన్నెత్తు మాట అంటే సహించే పరిస్థితి లేదు. అయితే.. ఇప్పుడు.. ఈ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నా రు పరిశీలకులు. వైఎస్ ఆత్మ క్షోభిస్తోందని చెబుతున్నారు.
దీనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సుపుత్రుడు.. సుపుత్రిక చేస్తున్న రాజకీయాలే కారణమని అంటు న్నారు పరిశీలకులు. వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్ని వారాల కిందట తెలంగాణలో వైఎస్‌ను తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో ఏకేశారు. నరరూప రాక్షసుడన్నారు. తెలంగాణ ద్రోహిగా పేర్కొన్నారు. అయినప్పటికీ.. అక్కడి కాంగ్రెస్ నాయకులు కానీ.. ఇతర నేతలు కానీ.. వైఎస్ అభిమానులు కానీ.. రియాక్ట్ అవలేదు. దీనికి కారణం.. వైఎస్ తనయ.,. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడమే. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటూ.. ఆమె చేసిన ప్రకటనే. అంతేకాదు.. తనకు బలం ఉందో లేదో తెలుసుకోకుండానే పరుగులు పెట్టడమే!
ఇక, తెలంగాణలో ప్రస్తుతం షర్మిలకు మొగ్గు లేదు. ఈ విషయం ఆమెకు తెలుసు.. ఎవరూ పార్టీలో చేరడం లేదు. దీనికితోడు అధికార పార్టీ టీఆర్ ఎస్ పై నిత్యం విమర్శలు చేయడం.. దీక్షలు చేయడం వంటివి కూడా ఇతర నేతలకు నచ్చడం లేదు. దీంతో ఒకప్పుడు వైఎస్‌ను అభిమానించిన వారు కూడా ఇప్పుడు ఆయనకు సపోర్టుగా నోరు విప్పలేక పోతున్నారు. ఎందుకంటే.. ఏమాత్రం వైఎస్‌కు అనుకూలంగా మాట్లాడినా.. వారిని షర్మిల తనఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. సో.. ఇది నచ్చని.. వైఎస్ అభిమానులు.. ఆయనను ఏమన్నా.. నోరు విప్పడం లేదు. కనీసం ఖండించడం లేదు.
ఇది.. నిజంగానే వైఎస్ ఆత్మ క్షోభకు దారితీయదా? అంటున్నారు పరిశీలకులు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. రాజన్న పాలన అందిస్తానని.. వైఎస్ పాలన చేరువ చేస్తానని.. చెప్పిన.. రాజన్న తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరి వైఎస్ మాదిరిగా.. ఒక కన్ను.. అభివృద్ది.. ఒక కన్ను పార్టీ కార్యకర్తలు.. అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఎందుకంటే.. తన గెలుపునకు సహకరించిన నాయకులను కార్యకర్తలను జగన్ ఎప్పుడో పక్కన పెట్టేశారు. కనీసం.. ఎన్నికల సమయలో తన మాటపై నమ్మకంతో టికెట్ త్యాగం చేసిన నాయకులను కూడా ఆయన పట్టించుకోవడం లేదు.
ఇక, పార్టీలో సీనియర్లకు విలువే లేకుండా పోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక, కార్యకర్తలు.. జగన్ వెంట వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మరి వారికైనా న్యాయం జరిగిందా? అంటే.. అది కూడా లేదు. ఒకప్పుడు.. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాల్యూ ఉండేది. ఆయన వారితో నేరుగా మాట్లాడేవారు. వారికి సమయం కేటాయించేవారు. అడగకుండానే కొన్ని.. అడిగినవి కొన్ని చేసి పెట్టారు. ఇదే.. వైఎస్‌ను దేవుడిని చేసింది. మరి.. ఇప్పుడు కార్యకర్తలు.. తాడిపల్లి గడప తొక్కే పరిస్థితి లేదు. కార్యకర్తల ఊసేలేదు. అంతా.. వలంటీర్ల జపమే! మరి.. కార్యకర్తల్లో అసంతృప్తి పెల్లుబుకదా?!
వైఎస్ విషయాన్ని తీసుకుంటే.. మరో కన్ను.. అభివృద్ధిగా ఆయన పాలన సాగించారు. అమెరికా నుంచి అధ్యక్షుడిని ఏపీకి రప్పించారు. అనేక విదేశీ సంస్థలను ఏపీకి పిలిచారు. కేవలం ఐదేళ్ల తొలిపాలనలోనే ఇవన్నీ చేశారు. సెజ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి.. ఇప్పుడు ఏపీ సర్కారు ఏం చేస్తోంది..? అంటే.. అప్పులు!! ఏనోటవిన్నా.. అప్పు మాటే వినిపిస్తోంది. వారంలోనే 5000 కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇది ఈ వారం లెక్క. మళ్లీ వచ్చే వారానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి.. అభివృద్ధి ఎక్కడ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అంటే.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి-పార్టీ కార్యకర్తలనే రెండు కళ్ల విధానాన్ని అనుసరిస్తే.. ఆయన తనయుడిగా.. వైఎస్ పాలన అందిస్తానని.. హామీ ఇచ్చి సీఎం పగ్గాలు చేపట్టి.. ఇప్పుడు.. అప్పులు-వలంటీర్లు అనే రెండు కళ్ల సిద్ధాంతాన్ని అముల చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇది వైఎస్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆయన రాజకీయ వారసుడు ఈయనేనా!? అనే ప్రశ్న వస్తోంది. ఇది.. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న వైఎస్ ఆత్మకు క్షోభ కలిగించదా!?