తామరాకు మీద నీటిబొట్టు మాదిరి వ్యవహరించాల్సిన స్థానాలు కొన్ని ఉంటాయి. చేసేది రాజకీయమే అయినా.. అత్యున్నత స్థానంలో కూర్చున్నప్పడు.. తర తమ బేధభావాల్ని మర్చిపోయి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అధికార.. విపక్షాలను సమన్వయం చేసుకుంటూ.. వ్యవహరించాల్సిన బాధ్యత లోక్ సభలో స్పీకర్ కు.. రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ కు ఉంటుంది.
సాధారణంగా అధికారపక్షానికి చెందిన ఎంపీ కానీ.. ఎమ్మెల్యే కానీ స్పీకర్ గా వ్యవహరిస్తుంటారు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం సంకీర్ణ ప్రభుత్వాల మిత్రపక్షాలకు చెందిన నేతలు స్పీకర్ పదవిని చేపడుతుంటారు. రాజ్యాంగపరమైన ఈ పదవిలో ఉన్న వారు.. తాము ప్రాతినిధ్యం వహించిన పార్టీని పక్కన పెట్టి చూడాల్సిన అవసరం ఉంది. అదే తీరులో వ్యవహరించి పలువురు స్పీకర్లు.. తాము కూర్చున్న స్థానానికి వన్నె తీసుకొస్తే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి.. ఉన్నత స్థానానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారని చెప్పాలి.
2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు హయాంలో.. అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన ప్రతిభా భారతిపై వెల్లువెత్తిన విమర్శల్ని అంత తేలిగ్గా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏపీ అసెంబ్లీకి స్పీకర్ గా వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాద్ పైనా ఇటీవల కాలంలో పలు విమర్శలు.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపక్షానికి అండగా నిలుస్తారన్న అపవాదు ఆయన మీద పడుతోంది. ఇదిలా ఉంటే.. స్పీకర్ పై తమకు నమ్మకం.. గౌరవం పోయాయని.. అందుకే తాము అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లుగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
బుధవారం నాటి సభలో జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయడానికి ముందు.. తన వెనుకున్న చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిజ్ఞ చేసిన వెంటనే సభను వాయిదా వేయాల్సిందిగా చెప్పటం కనిపించింది. దీనికి కాల్వ శ్రీనివాసులు తలూపుతూ.. చేతులతో స్పీకర్ కు సైగ చేయటం.. ప్రతిన అయిపోయిన వెంటనే.. సభను వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. దీనిపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతిన అయిపోయిన వెంటనే విపక్ష నేత జగన్ మాట్లాడాల్సి ఉంటుంది. ఆ అవకాశం రాకుండా ఉండేందుకే.. సభను వాయిదా వేసినట్లుగా జగన్ ఆరోపించారు. గురువారం సైతం ఇలాంటి పరిస్థితే నెలకొందని ఆయన విమర్శించారు.
తాను అగ్రిగోల్డ్ ఇష్యూ గురించి మాట్లాడుతుంటే.. అందుకు భిన్నంగా జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా స్పీకర్ వ్యాఖ్యలపై సాక్షి ప్రచారం చేసిందని.. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని.. మరికొందరు సాక్షి ఎడిటర్ ను సభకు పిలిపించాలంటూ పలువురు సభ్యులు వ్యాఖ్యానించటం కనిపించింది. దీనిపై జగన్ స్పందిస్తూ.. తమకు స్పీకర్ పై నమ్మకం పోయిందని.. అవిశ్వాస తీర్మానం పెట్టాలని తాము భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/