రాజకీయ అనుభవ లోపంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ బాధపడుతోందా? అధికార టీడీపీ వేసే ఎత్తుల్లో ప్రతిపక్ష వైసీపీ ఇబ్బందుల పాలు అవుతోందా? ప‌్రజా సమస్యల అండగా...అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో వైఫల్యం అవుతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.
అయిదు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమయంలో మంచి అవకాశం మిస్ అయ్యిందని కొందరు ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు. అసెంబ్లీ నిబంధనలు, ప్రస్తుత సంఖ్యా బలాన్ని బట్టి ప్రతిరోజూ 10 ప్రశ్నలు చర్చకు వస్తాయి. అందులో ఐదు అధికార పార్టీకి, రెండు ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి, ఒకటి బీజేపీకి, మిగిలిన రెండు రొటేషన్ లో లాటరీ తీసి ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకి కేటాయిస్తారు.
అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం అంటే శాఖలను కదిలించడమే. అధికారుల వైఫల్యాలను సభలో ఎత్తిచూపే అవకాశం సభ్యులకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత మంది ఎమ్మెల్యే లు కీలకమైన అంశాలపై ప్రశ్నలు వేస్తుంటారు. ఇలా ప్రశ్నలు వేసిన వారిని అధికారులు జాగ్రత్తగా చూసుకుంటుంటారు. వారు అడిగిన పనులు కొర్రీ పెట్టకుండా వెంటనే చేసిపెడుతుంటారు. అలాంటి ప్రజాప్రతినిధులంటే కాస్త భయభక్తులతో మెలుగుతారు. అధికారులే కాదు.. ఆ ప్రశ్నతో సంబంధం ఉన్న వారంతా అటెన్షన్ లోకి వస్తారన్న మాట. దానితోపాటే మీడియాలో వచ్చే కవరేజ్ కి జిల్లాలో, నియోజకవర్గంలో పేరు కూడా వస్తుంది. కానీ ఈసారి ఆ అవకాశం మిస్ అయ్యింది.
అధికార-ప్రతిపక్షాల మధ్య జరిగిన గొడవలతో ప్రశ్నోత్తరాలు కొన్నిసార్లు రద్దయ్యాయి. కొన్ని సార్లు వాయిదా పడ్డాయి. ఇంకొన్ని సార్లు లిఖిత పూర్వక సమాధానాల రూపంలో వచ్చాయి. అంతేకానీ... పూర్తి స్థాయిలో చర్చ మాత్రం జరగలేదు. అసెంబ్లీ జరిగిన ఐదు రోజుల్లో ఒక్క రోజు మాత్రమే ప్రశ్నోత్తరాలపై చర్చ జరిగింది. అదీ రెండు ప్రశ్నలపైనే. మిగిలిన ప్రశ్నలలో కొన్ని వాయిదా పడగా.. కొన్నింటికి అధికారులు ఇచ్చిన సమాధానాలను మంత్రి చెప్పినట్లుగానే భావించాలని స్పీకర్ కోడెల ప్రకటించారు. ఈ పరిణామం ప్రశ్నలు వేసిన ఎమ్మెల్యే లకు ఏ మాత్రం మింగుడుపడలేదు. మంచి అవకాశం మిస్ అయ్యామంటూ వాపోయారట. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యే లు కూడా ఉన్నారు. ఓ ఎమ్మెల్యే అయితే... ప్రతిపక్ష ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి కనీసం ప్రశ్నోత్తరాలు జరిగే వరకైనా ఓపికపట్టండి బాబూ... అధికారులు అస్సలే మాట వినడంలేదు.. ప్రశ్నలు వేసి దారికి తెచ్చుకుందామని ప్రతిపాదించారట. ప్రభుత్వంలో ఎలాగూ పనులు కాని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇదే మంచి మార్గంగా కనిపించినా... పార్టీల అజెండాలో వారి వ్యక్తిగత అభిప్రాయాలు కొట్టుకుపోయాయంటున్నారు.