బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ పార్టీ ఎంత విద్వేషం నూరిపోయాలో అంతా చేస్తుంది. గత నాలుగేళ్లు అధికారాన్ని పంచుకుని ఇప్పుడు దూరమైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంలో తన పాత్రేమీ లేనట్లు - అసలు తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నాడు. బీజేపీకి దూరమయిన బాబు ఎక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరవుతుందో అన్న భయంలో ఆ పార్టీకి - బీజేపీకి లింకులు పెడుతూ పార్టీ నేతలతో పాటు - తనూ నిత్యం ఆరోపణలతో మీడియాకు ఎక్కుతున్నాడు.
కేంద్రంతో నాలుగేళ్లు కలిసి నడిచి రాష్ట్రం అభివృద్ది చేయకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు బీజేపీకి వైసీపీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయడం ఏంటని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రాభివృద్ధికి పాటుపడేది వైసీపీయేనని - ఆంధ్రకు నష్టం చేసింది టీడీపీ - బీజేపీలేనని విమర్శించారు.
గత నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు అవినీతి పాలన - దోపిడీని పుస్తక రూపంలో తీసుకువచ్చి దేశంలోని అన్ని పార్టీల నేతలకు వాటిని అందజేస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ ట్యాంపరింగ్ సంస్కృతి మాకు లేదని, అన్ని విషయాలూ ప్రజలకు తెలుసని, తమ పార్టీ ఎమ్మెల్యే ఢిల్లీకి వెళ్తే టీడీపీకి ఎందుకు ఉలుకు అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చంద్రబాబు పక్కనే ఉంటారని - మహారాష్ట్రకు చెందిన మంత్రి భార్య టీటీడీలో సభ్యురాలని ఈ లెక్కన ఎవరివి లాలూచీ రాజకీయాలు అని బొత్స ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఇంతవరకు బీజేపీ నేత రాంమాధవ్ ను కలవనే లేదన్నట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు అవినీతి రాజకీయాలకు ప్రజలు అంతం పలికే సమయం ఆసన్నమయిందని అన్నారు.