అసలే ఫైర్ బ్రాండ్.. ఆపై తీవ్రంగా విరుచుకుపడితే ఎలా ఉంటుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మాటలు వింటే.. ఈ ప్రశ్నకు సమాధానం ఇట్టే అర్థమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు.. మంత్రి నారా లోకేశ్ ఇటీవల కాలంలో చేసిన పలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారటమే కాదు.. బోలెడన్ని జోకులు.. వ్యంగ్య వ్యాఖ్యలకు రోజూ అడ్రస్ గా నిలుస్తున్నాయి. ఇలాంటివేళ.. లోకేశ్ తీరుపై ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేశ్ తీరును తప్పు పట్టిన ఆమె.. తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మినహా మంత్రి కావటానికి లోకేశ్ కు ఇంకేం అర్హతలు ఉన్నాయి? అంటూ సూటిగా ప్రశ్నించారు.
అనంతపురంలో మాట్లాడిన ఆమె లోకేశ్ పై చెలరేగిపోయారు. జయంతికి.. వర్థంతికి తేడా తెలియదని.. పంచాయితీ రాజ్ మంత్రిగా తాగునీటి సమస్యను సృష్టించటమే లక్ష్యమంటారా? అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియకుండా వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో గెలిపించాలలని వ్యాఖ్యానించటం ఏమిటని మండిపడ్డారు.
"ఇలా మాట్లాడే వ్యక్తిని పప్పు అనకుండా ఇంకేం అనాలి? గూగుల్ లో పప్పు అని టైప్ చేసి సెర్చ్ చేస్తే.. పప్పు దినుసులతో పాటు నారా లోకేశ్ ఫోటోలు వస్తున్నాయి. దద్దమ్మ మంత్రిని ప్రజలపై బలవంతంగా చంద్రబాబు రుద్దుతున్నారు" అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల చంద్రబాబు హయాంలో ఒక్క ఇంటికైనా.. ఒక్క మేలు జరిగిందా? అని ప్రశ్నించారు. టీడీపీకి జనాదరణ పెరిగిందని ముఖ్యమంత్రి చెబుతున్నారని.. అదే నిజమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసిన 21 మంది ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా ఆయన కుమారుడు లోకేశ్ మీద రోజా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/