టీడీపీ తుపాకీ కుట్ర‌పై న్యాయ విచారణ‌!

Update: 2017-08-25 04:47 GMT
ఎమ్మెల్సీ ప‌దవికి రాజీనామా చేసి.. టీడీపీకి స‌వాల్ విసిరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌పై న‌డిరోడ్డు మీదే క‌త్తులు, తుపాకుల‌తో బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న టీడీపీ గూండా రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట‌గా నిలుస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఓట‌మి భ‌యంలో ర‌గిలిపోతున్న టీడీపీ నేత‌లు ఇప్పుడే ఇలా వీరంగం సృష్టిస్తుంటే.. కౌంటింగ్ స‌మ‌యంలో.. ఇంకెంత బీభ‌త్సం సృష్టిస్తారోన‌నేది ఊహించ‌డమే క‌ష్టం. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌గా.. టీడీపీ నేత‌ల‌కు తుపాకులు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయి? వీటిని డిపాజిట్ చేయ‌కుండా త‌మ ద‌గ్గ‌రే ఎందుకు ఉంచుకున్న‌ట్లు? అనే సందేహాలు ఇప్పుడు వినిపిస్తున్నా యి. టీడీపీ కుట్ర ప్ర‌కార‌మే వీటిని డిపాజిట్ చేయ‌లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

నంద్యాల ఉప ఎన్నిక‌ల ఘ‌ట్టం ముగిసింది. ఓట‌రు చైత‌న్యం వెల్లివిరిసింది. దాదాపు 80 శాతానికి పైగా పోలింగ్ శాతం న‌మోద‌వ్వ‌డం ఇప్పుడు టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తోంది. ఇక శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డిపై నంద్యాల‌లో టీడీపీ నాయ‌కులు తెగ‌బ‌డిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో 28వ తేదీన జ‌రిగే నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31 వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ చాలా మంది ఆయుధాలు పోలీసులకు అప్పగించలేదని ఆయ‌న తెలిపారు.

కర్నూలు జిల్లాలో మొత్తం 2,252 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయని, ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో 1,211 మంది మాత్రమే స్థానిక పోలీస్ స్టేషన్లలో త‌మ ఆయుధాల‌ను డిపాజిట్‌ చేశారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. ఆయుధాలు డిపాజిట్‌ చేయకుండా టీడీపీ పథక రచన చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీ కుట్రపై న్యాయ విచారణ జరిపించాలని శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. మ‌రి ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.
Tags:    

Similar News