దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్వయాన సోదరుడు కమ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసింది చెప్పాల్సిన అవసరమే లేదు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకూ.. ఒక కొలిక్కి రాని విషయం తెలిసిందే. ఆయన హత్యోదంతంపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు శ్రీనివాసులరెడ్డి తాజాగా కడప ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకోవటం షాకింగ్ గా మారింది. తనకు.. వివేకా హత్యకు సంబంధం లేదని చెప్పిన ఆయన.. తాజాగా సూసైడ్ చేసుకోవటం పలు అనుమానాలకు తెర తీసేలా చేసింది.
పోలీసుల వేధింపులను భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి.. వైఎస్ భాస్కర్ రెడ్డికి వేర్వేరుగా రాసిన లేఖలో శ్రీనివాసరెడ్డి పలు అంశాల్ని పేర్కొన్నారు. విచారణ పేరుతో సీఐ రాములు తనను తీవ్రంగా వేధింపులకు గురి చేసినట్లుగా శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
వివేకా హత్య కేసును కొలిక్కి తీసుకొచ్చి.. విచారణను పూర్తి చేయాలన్న గట్టి పట్టుదలతో పోలీసు శాఖ పనిచేసింది. వివేక హత్య కేసుకు సంబంధించి ఇంటి వాచ్ మెన్ రంగయ్యకు ఇప్పటికే నార్కో అనాలసిస్.. పాలిగ్రాఫ్.. బీప్ పరీక్షల్ని నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరటం.. ఆ వెంటనే జడ్జి ఇచ్చేయటం జరిగింది. దీంతో.. విచారణ కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. వివేకా కేసు ఒకకొలిక్కి వస్తుందన్న వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న ఆత్మహత్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది.