ప్రివిలేజ్ కమిటి పంపించిన నోటీసుకు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ చాలా విచిత్రంగా ఉంది. ఇద్దరు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ హక్కులకు భంగం కలిగించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటి ఓ నోటీసును పంపింది. వ్యక్తిగత విచారణకు హాజరవ్వాల్సుంటుందని నోటీసులో అసెంబ్లీ సెక్రటరీ చెప్పారు.
కమిటి తరపున అసెంబ్లీ సెక్రటరీ పంపిన నోటీసుకు నిమ్మగడ్డ శుక్రవారం సమాధానంగా మరో లేఖను పంపారు. అందులో చాలా విషయాలు రాసినా ముఖ్యంగా నాలుగు పాయింట్లను మాత్రమే చెప్పుకోవాలి. మొదటిదేమో తాను ప్రివిలేజ్ కమిటి పరిధిలోకి రానని. రెండోదేమో తాను ఏ సభ్యుడిని కించపరచలేదని. మూడోదేమో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కారణంగా కొద్దిరోజులు విచారణకు హాజరుకాలేనని. నాలుగోదేమో, అయినా కానీ కమిటి విచారణకు హాజరవుతానని.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను ప్రివిలేజ్ కమిటి పరిధిలోకి రానని చెప్పటమే తప్పు. కచ్చితంగా కమిటి పరిధిలోకి వస్తారు. ఎలాగంటే మహరాష్ట్రలో కూడా అప్పుడెప్పుడో స్టేట్ ఎలక్షన్ కమీషనర్-ప్రభుత్వానికి వివాదం రేగినపుడు ప్రివిలేజ్ కమిటి కమీషనర్ ను పిలిపించి విచారించింది. తర్వాత జైలుశిక్ష కూడా విధించింది. అంటే తన లేఖలో నిమ్మగడ్డ చెప్పింది అబద్ధమని తేలిపోయింది.
ఇక తాను ఏ సభ్యుడిని కించపరచలేదని. పెద్దిరెడ్డిని ఇల్లు కదలనీయద్దని పోలీసులకు ఆదేశాలివ్వటాన్ని నిమ్మగడ్డ ఎలా సమర్ధించుకుంటారు. అలాగే మీడియాతో మాట్లాడేందుకు కూడా లేదని ఆదేశించారు కదా. ఇదే విషయమై పెద్దిరెడ్డి కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన కోర్టు నిమ్మగడ్డ ఆదేశాలు చెల్లవని తీర్పుచెప్పింది. అంటే తనకు లేని అధికారాలను నిమ్మగడ్డ తీసుకున్నారన్నది స్పష్టమవుతోంది. పైగా పెద్దిరెడ్డి, బొత్సపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దాంతోనే మంత్రులకు, నిమ్మగడ్డకు వివాదం మొదలైంది.
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కారణంగా ప్రయాణం చేయలేనని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఓ అర్ధగంట పాటు అబ్సర్వేషన్లో ఉంచి తర్వాత డాక్టర్లు పంపేస్తారు. అంతేకానీ ప్రయాణాలు చేయవద్దని ఎవరు చెప్పరు. మరదే నిజమైతే ఎల్టీసీ మీద ప్రయాణం ఎలా పెట్టుకున్నారు. లేఖలో ఇన్ని విషయాలు రాసిన తర్వాత విచారణకు తప్పకుండా హాజరవుతానని మళ్ళీ ఎలా చెప్పారు.
అంటే తనను పిలిపించి విచారించే అధికారం ప్రివిలేజ్ కమిటికి ఉందని నిమ్మగడ్డకు బాగా తెలుసు. నిజంగానే తనను విచారించే అధికారం కమిటికి లేకపోతే కమిటి పంపిన నోటీసును నిమ్మగడ్డ అసలు లెక్క చేసేవారే కాదు. విచారణకు హాజరవుతానని అంగీకరించారంటేనే కమిటి అధికారాన్ని నిమ్మగడ్డ అంగీకరించినట్లే. చూద్దాం కమిటి ఎలాగ రియాక్టవుతుందో.