కొద్దిరోజుల కిందట జగన్ చేసిన ఓ కామెంట్ గుర్తుండే ఉంటుంది. 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఒక్క పూటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఆయన అన్నారు. ఏ ముహూర్తంలో ఆయన ఆ మాట అన్నారో కానీ, దాన్ని సవాలుగా తీసుకుని టీడీపీ ఆయన చెప్పిన సంఖ్య మేరకు 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. మరో 13 మంది చేర్చుకోవాలని టీడీపీ టార్గెట్ పెట్టుకుందని తెలుస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ లో అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని సమాచారం.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత రెండో విడత ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కొందరు మంత్రులు - సీనియర్ నేతలు ఆ పనిలో ఉన్నారు. వచ్చే నెలలో మరో అయిదుగురు టీడీపీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఆ తరువాత మే నెలలోనూ వలసలు కొనసాగుతాయని తెలుస్తోంది. జగన్ పార్టీని కుదేలు చేయడమే లక్ష్యంగా టీడీపీ గట్టి ప్రణాళికలే రచిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.