కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ దీక్ష... కౌంటర్ గా బీసీల ఉద్యమాలతో బుర్ర వేడెక్కిపోయిందో ఏమోకానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం నోరు జారారు. ఎన్నడూ లేనిది మాటల్లో ఆయన బోల్తాపడ్డారు. ఇప్పుడాయన అన్న మాట వివాదంగా మారుతోంది. ఎవరైనా ఎస్సీగా ఎందుకు పుట్టాలని అనుకుంటారు? అంటూ ఫ్లోలో మాట్లాడేసిన చంద్రబాబు ఇప్పుడు దాని కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. విమర్శలే కాదు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చినా రావొచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు అన్న ఆ మాటను పట్టుకుని ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టొచ్చని చెబుతున్నారు. వైసీపీ నేతలు కొందరు ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం.
వైసీపీ నేతలపై టీడీపీ ప్రధానంగా అట్రాసిటీ కేసులే పెడుతోంది. భూమా నాగిరెడ్డి - రోజా వంటి నేతలపై టీడీపీ అట్రాసిటీ కేసులు పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక డీఎస్పీని 'డోన్ట్ టచ్ మీ' అన్న వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపారు. తాము అంటరానివారం కాదని దగ్గరకు వచ్చి మాట్లాడండి అని ఒక అధికారిని ఉద్దేశించి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలతో ఆమెపై అట్రాసిటీ కేసు పెట్టారు.
అయితే... తాజాగా చంద్రబాబే తన మాటల్లో ''ఎస్సీల్లో పుట్టాలని ఎవరూ కోరుకోరు'' అని అనడంతో దాని ఆధారంగా అట్రాసిటీ కేసు పెట్టేందుకు గల సాధ్యాసాధ్యాలను వైసీపీలోని పలువురు నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే... ఇంకా జగన్ వరకు ఈ విషయం తీసుకెళ్లలేదని... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముఖ్యమంత్రిపై అట్రాసిటీ కేసు పెట్టడం గ్యారంటీ అని తెలుస్తోంది.