జ‌గ‌న్ నుంచి జంప్ అయ్యేది ఎంద‌రు?

Update: 2016-02-23 11:30 GMT
ఏపీ విప‌క్షంలో క‌ల‌క‌లం. పైకి బింకంగా కనిపిస్తున్నా.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు.. రానున్న కొద్దిరోజుల్లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న జంపింగ్స్ వాద‌న‌లు వ‌ణుకు పుట్టిస్తున్నాయి. మ‌రే విప‌క్ష నేత మాట్లాడ‌ని రీతిలో.. బ‌లంగా ఉన్న అధికార‌ప‌క్షాన్ని కూల్చేస్తాన‌న్న జ‌గ‌న్ మాట‌ల్ని స‌వాలుగా తీసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి జ‌గ‌న్‌కు భారీ షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది. తొలి రౌండ్‌ లోనే న‌లుగురు ఎమ్మెల్యేల్ని పార్టీలోకి ఆహ్వానించి జ‌గ‌న్ పార్టీకి త‌మ‌దైన సందేశాన్ని పంపిన బాబు.. రానున్న రోజుల్లో మ‌రింత‌మందిని సైకిల్ ఎక్కించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ ఇప్ప‌టికే జ‌రిగిపోయింద‌ని.. తుది చ‌ర్చ‌లు.. ముహూర్తం మాత్ర‌మే మిగిలి ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సంత‌బేరం.. నాలుగు వికెట్లు అంటూ జ‌గ‌న్ బ్యాచ్ సింఫుల్ గా తీసేసినా.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే ప‌రిణామాలు చాలా సీరియ‌స్‌ గా ఉంటాయ‌న్న మాట వినిపిస్తోంది.

ఏపీలోని ప‌ద‌మూడు జిల్లాల్లో రెండు.. మూడు జిల్లాల మిన‌హా మిగిలిన ప్ర‌తి జిల్లా నుంచి జంపింగ్ త‌ప్ప‌ద‌ని తేల్చి చెబుతున్నారు. ఉత్త‌రాంధ్ర మొద‌లుకొని సీమ వ‌ర‌కు జ‌గ‌న్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వ‌రుస పెట్టి సైకిల్ ఎక్క‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. త‌క్కువ‌లో త‌క్కువ డ‌జ‌న్ కు త‌గ్గ‌కుండా జ‌గ‌న్ ఎమ్మెల్యేలు జంప్ కావ‌టానికి సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఈ సంఖ్య గ‌రిష్ఠంగా 20 వ‌ర‌కూ ఉండే అవ‌కాశం ఉంది. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక‌రు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి ఇద్ద‌రు.. విశాఖ జిల్లా నుంచి ఒక‌రు.. తూర్పు గోదావ‌రి ఒక‌రు ఉన్నారు.

ఇక..కృష్ణా జిల్లా నుంచి ఇప్ప‌టికే పార్టీ మారిన జ‌లీల్‌ ఖాన్ కాకుండా మ‌రో ఇద్ద‌రు.. గుంటూరు జిల్లా నుంచి ఇద్ద‌రు.. ప్ర‌కాశంలో ముగ్గురు.. నెల్లూరు జిల్లా నుంచి ఇద్ద‌రు.. క‌ర్నూలు జిల్లా నుంచి మ‌రో ఇద్ద‌రు వ‌ర‌కూ పార్టీ మార‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. వీరు మాత్ర‌మే కాకుండా మ‌రికొంద‌రు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. రానున్న కాల‌మంతా జంపింగ్సే.. జంపింగ్స్ అన్న‌ట్లు లేదు..?
Tags:    

Similar News