విజయనగరం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన బొత్స సత్తిబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్ఠంభన ఒక కొలిక్కి రాని పరిస్థితి. బొత్స రాకతో.. తమ దారిన తాము పోతామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి రాజాలు.. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావు.. ఆయన సోదరుడు తేల్చి చెబుతున్న సంగతి తెలిసిందే.
ఆయన పార్టీ నుంచి వీడిపోకుండా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు కిందామీదాపడుతున్న సంగతి తెలిసిందే. సుజయ రంగారావును బుజ్జిగించేందుకు జగన్‌కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి.. కొలగట్ల వీరభద్రస్వామి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జెరూసలెం వెళ్లిన జగన్ తిరిగి వచ్చే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. అధినేతను ఒకసారి కలిసి నిర్ణయం తీసుకోవాలన్న మాటకు సుజయ రంగారావు సిద్ధంగా లేరని చెబుతున్నారు.
మరోవైపు.. సుజయతో చర్చలు జరిపిన అనంతరం.. కొలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. సుజయరంగారావు పార్టీలో కొనసాగుతారని స్పష్టం చేస్తున్నారు.దీనికి భిన్నంగా సుజయ వర్గీయులు మాత్రం.. పార్టీ మారిపోయే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుజయ రంగారావు పార్టీలో కొనసాగుతారంటూ మాటలు చెప్పే బదులు.. ఆయన్ను కలుపుకొని విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోతుంది కదా? అదేమీ లేకుండా.. జగన్ తోకలు.. మాట్లాటం ఏమిటంటే.. సుజయ వర్గీయులు విరుచుకుపడటం గమనార్హం.