కొత్త డిమాండ్: ఏపీకి 4వ రాజధాని రాజమండ్రి

Update: 2020-01-10 11:12 GMT
ఏపీకి 3 రాజధానులు అవసరం అని సీఎం జగన్ ఎప్పుడైతే కామెంట్ చేశారో అప్పుడే సెగ రాజుకుంది. రాజధాని మార్పు వద్దని అమరావతి వాసులు .. కావాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు ఆందోళన మొదలుపెట్టారు. అధికార, ప్రతిపక్షాల వారు కొట్టుకుచస్తున్నారు.

అయితే సందులో సడేమియాలాగా కొత్త రాజధాని ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా రాజమండ్రి లో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మంత్రి శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ.. ‘ఏపీకి మూడు రాజధానులు కాదని.. నాలుగు కావాలని డిమాండ్ చేశారు. ఏపీకి సాంస్కృతిక రాజధాని గా రాజమండ్రి ని చేయాలని ’ డిమాండ్ చేశారు.

ఏపీకి నాలుగు రాజధానులు ఉంటే బాగుంటుందనే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. రాజమండ్రి ని సాంస్కృతిక రాజధాని గా మార్చాలని కోరుతానని తెలిపారు.

ఇలా ప్రాంతాలను బట్టి ఆయా నేతలు రాజధాని పై తమ ఇష్టాలను తమ నగరాలను రాజధానులు గా చేయాలన్న ప్రతిపాదనను చేస్తున్నారు.
Tags:    

Similar News